కృష్ణగాడి క్రియేటర్.. మళ్లీ లవ్ స్టోరీనే

Update: 2016-02-17 19:30 GMT
‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు హను రాఘవపూడి. ఆ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా.. అతడికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ‘అందాల రాక్షసి’ వచ్చిన మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు హను. ఈసారి ప్రశంసలకు తోడు కాసులు కూడా కురుస్తున్నాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ పెద్ద హిట్టయింది. ఈ ఊపులో తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు హను. ఇప్పటికే స్క్రిప్టు రెడీగా ఉందని.. నెలా రెండు నెలల్లోనే తన తర్వాతి సినిమా మొదలైపోతుందని అంటున్నాడు హను. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ను నిర్మించిన 14 రీల్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుందని.. నానినే హీరో కావచ్చిన చెప్పాడతను.

‘అందాల రాక్షసి’కి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు ఎంతో వైవిధ్యం చూపించిన హను.. ఇంతకీ తర్వాతి సినిమా ఎలా తీయబోతున్నాడో అడిగితే.. ‘‘ఇది కూడా లవ్ స్టోరీనే. కాకపోతే బ్యాక్ డ్రాప్ వేరే ఉంటుంది. నా తొలి సినిమాకు, రెండో సినిమాకు ఎంత వైవిధ్యం ఉంటుందో.. అలాగే మూడో సినిమా అంత కొత్తగా ఉంటుంది. లవ్ స్టోరీ అనేది అన్ని సినిమాల్లో కామనే. కానీ దానికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తామన్నది కీలకం. ఆ విషయంలో పూర్తి వైవిధ్యం చూపించబోతున్నా. ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటుందీ సినిమా’’ అని హను చెప్పాడు. మణిరత్నం అంటే తనకు పిచ్చి అభిమానమని.. అందుకే ఆయన ప్రభావం ‘అందాల రాక్షసి’పై ఉండొచ్చని.. ఐతే ఆ ప్రభావం నుంచి త్వరగానే బయటికి వచ్చేశానని హను అన్నాడు.
Tags:    

Similar News