నేచురల్ స్టార్ నాని - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ రిలీజ్ కు రెడీ అయింది. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు పూర్తి చేశారు. ఇప్పటివరకూ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ జరిగిన మూవీగా కృష్ణగాడి వీర ప్రేమగాధ ఇప్పటికే రికార్డు సృష్టించింది. అసలు ఈ సినిమాకి ఇంత పెద్ద టైటిల్ పెట్టడంపై చాలానే కామెంట్స్ వస్తున్నాయి.
టైటిల్ లెంగ్త్ ఎక్కువగా ఉందని చాలా మంది అంటున్నారు. అయితే ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైటిల్ అంటున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అసలు ఈ పేరు పెట్టాలని సలహా ఇచ్చింది బాల నయని అని చెప్పాడు. టైటిల్ విషయంలో టీం అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నపుడు.. ఏం పేరు పెడదాం అని సరదాగా ఆ చిన్నారిని అడిగితే.. టక్కుమని కృష్ణగాడి వీర ప్రేమగాధ అని చెప్పిందట. దీనితో షాక్ తిన్న అందరూ.. ఇదే కరెక్ట్ టైటిల్ అని ఫిక్స్ అయ్యారట. అలాగే జై బాలయ్య అనే టైటిల్ అసలు తమ పరిశీలనలో కూడా లేదని చెప్పాడు డైరెక్టర్.
ఈ దర్శకుడి తొలి సినిమా అందాల రాక్షసి.. చాలా అందంగా, హృద్యంగా ఉంటుంది. కానీ ఈ మూవీ అలాకాదని.. రాయలసీమ ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అన్న హను.. తన ప్రేమను దక్కించుకోవడానికి ఓ పిరికివాడు చేసిన అతి పెద్ద సాహస ప్రయాణం ఏంటనేదే.. తమ కృష్ణగాడి వీర ప్రేమగాధ అని వివరించాడు. అలాగే.. అందాల రాక్షసి పద్య భాగం అయితే... ఈ మూవీ గద్య భాగం అనీ.. రెండింటికీ మధ్య అంతగా తేడా ఉంటుందన్నాడు దర్శకుడు హను రాఘవపూడి.