గీతా బ్రసాతో హర్భజన్ పెళ్లి

Update: 2015-08-22 11:04 GMT
కొందరు భారత క్రికెటర్లకు అంత ఈజీగా పెళ్లి మీద మోజు పుట్టదు. సచిన్ లాగా 21 ఏళ్లకే పెళ్లాడేయాలని ఎవరూ కోరుకోరు కానీ.. కనీసం 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటే బావుంటుందని అనుకుంటారు కదా. కానీ యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ లాంటి వాళ్లు ముదురు బెండకాయల్లా తయారైనా ఇంకా పెళ్లి ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. యువరాజ్, జహీర్ లకు పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు కానీ.. హర్భజన్ సింగ్ కు బాలీవుడ్ భామ గీతా బ్రసాతో చాలా ఏళ్లుగా ఎఫైర్ ఉంది. ఐతే తోబుట్టువులందరి పెళ్లిళ్లు చేసే వరకు తాను పెళ్లాడనంటూ శపథం చేసిన భజ్జీ భాయ్ ఆ బాధ్యతలన్నీ  కూడా తీర్చేసుకుని కొన్నేళ్లయింది. అయినా పెళ్లి ఊసెత్తలేదు.

దీంతో గీతా బ్రసాకేమైనా గుడ్ బై చెప్పేశాడేమో అన్న డౌట్లొచ్చాయి కానీ.. అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఎట్టకేలకు హర్భజన్ పెళ్లికి ఓకే చెప్పేశాడు. ఈ ఏడాది అక్టోబరు 29న హర్భజన్, గీతాల పెళ్లి జరగనున్నట్లు హర్భజన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫాగార్వాలో హోటల్ క్లబ్ కెబనాలో వీరి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం హర్భజన్ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. రీఎంట్రీలో అతను పెద్దగా ప్రభావం చూపించట్లేదు. తొలి టెస్టులో ఘోర వైఫల్యం తర్వాత అతడడిపై వేటు పడింది. అక్టోబరులో దక్షిణాఫ్రికా జట్టు భారత్ తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఐతే ఆ సిరీస్ లో తనకు చోటు దక్కదని ఫిక్సయ్యాడో ఏమో.. అదే నెలలో పెళ్లి డేటు ఖాయం చేసుకున్నాడు హర్భజన్.  ఏదేమైనా 35 ఏళ్లకైనా హర్భజన్ కు పెళ్లి ఆలోచన వచ్చినందుకు సంతోషం.
Tags:    

Similar News