హ‌రి హ‌రుడి కీల‌క యుద్ధం ముగిసిందా?

Update: 2022-12-21 14:50 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంతో పోలిస్తే సినిమాల విష‌యంలో తాజాగా స్పీడు పెంచేశాడు. గ‌త‌ కొన్ని నెలలుగా పొలిటిక‌ల్ షెడ్యూల్ కార‌ణంగా వాయిదా వేస్తూ వ‌స్తున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` మూవీని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు. ప‌వ‌న్ న‌టిస్తున్న తొలి పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ మూవీ ఇది. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం మ‌రో ప్రొడ్యూస‌ర్ ఏ.ద‌యాక‌ర్ రావుతో క‌లిసి ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ న‌టులు న‌ర్గీస్ ఫ‌క్రీ, అర్జున్ రాంపాల్ న‌టిస్తున్నారు.

17వ శ‌తాబ్దం కాలంలోని మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇందులో ప‌వ‌న్ కల్యాణ్ రాబిన్ హుడ్ త‌ర‌హా బందిపోటు పాత్ర‌లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`గా క‌నిపించ‌బోతున్నాడు. నిధి అగ‌ర్వాల్ పంచ‌మిగా, న‌ర్గీస్ ఫ‌క్రీ రోష‌నార‌గా న‌టిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎట్ట‌కేల‌కు రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. వంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టీస్ట్ లు పాల్గొన‌గా ఇటీవ‌ల కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించిన క్రిష్ తాజాగా క‌థ‌కు అత్యంత కీల‌క‌మైన యుద్ధ ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన‌ట్టుగా తెలిసింది.

ఈ విష‌యాన్ని తాజాగా ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సెట్ లో త‌న‌కు ఓ విగ్ర‌హాన్ని బ‌హుమ‌తిగా ఇస్తున్న ఓ ఫొటోని షేర్ చేసిన విజ‌య్ మాస్ట‌ర్ ` `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` మూవీకి సంబంధించిన కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టం నిన్న మంగ‌ళ‌వారం ముగిసింద‌ని తెలిపారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించి, న‌న్ను అభినందించిన‌ కల్యాణ్ బాబుకు కృత‌జ్ఞ‌త‌ల‌ని, ప్ర‌స్తుతం మ‌రో యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ప్రిప‌రేష‌న్ మొద‌లైంద‌ని చెప్పుకొచ్చాడు.

ఇదిలా వుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో తొలి సారి న‌టిస్తున్న తొలి పీరియాడిక్ పిల్మ్ ఇది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ మూవీ కోసం ఆస‌క్త‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ పీరియాడిక్ లుక్ కు సంబంధించిన విజువ‌ల్స్ అబిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

సినిమా అంతా మొఘ‌ల్ సామ్రాజ్య కాలం నాటి కోహినూర్ వజ్రం నేప‌థ్యంలో సాగుతుందిని, అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 30న పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News