పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ సగం పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెళ్లడించాడు. త్వరలోనే మిగిలిన పార్ట్ ను కూడా ముగించాలని క్రిష్ ఎదురు చూస్తున్నారు. సినిమా మేకింగ్ లో స్పీడ్ క్రిష్ ప్రత్యేకత. అందుకే హరి హర వీరమల్లు సినిమా తక్కువ సమయంలోనే సగంకు పైగా చిత్రీకరణ పూర్తి చేశాడు. మరో రెండు నెలల సమయం ఇస్తే క్రిష్ మొత్తం ముగించే అవకాశాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ ప్రథానంగా రూపొందుతున్న సినిమా. భారీ ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కొండ పొలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న క్రిష్ మాట్లాడుతూ హరి హర వీరమల్లు సినిమా చరిత్రలోని కొన్ని కీలక సంఘటనలు మరియు గొప్ప వ్యక్తులను తీసుకుని అప్పటి కాలమానం నేపథ్యంలో కథను తయారు చేయడం జరిగింది. క్రిష్ చాలా విభిన్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మొఘలాయిల కాలంలో ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. ఇది ఒక యదార్థ కథ కాదని పూర్తిగా కల్పిత కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. చరిత్ర నేపథ్యంలో ఈమద్య వరుసగా సినిమాలు వస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను పవన్ కెరీర్ లో ఒక విభిన్నమైన సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్ల పవన్ సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకంను అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను ఒక విభిన్నమైన సినిమాలో అది కూడా పీరియాడిక్ మూవీలో చూడాలని కలలు కన్న అభిమానులకు హరి హర వీరమల్లు ఒక వరంగా మారబోతుంది అంటున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. పవన్ కెరీర్ లో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా నిలిచింది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను కూడా ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ముగించే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హరి హర వీరమల్లు మరియు భవదీయుడు భగత్ సింగ్ సినిమాల షూట్ లో పాల్గొనబోతున్నాడు. వచ్చే సంక్రాంతికి భీమ్లా నాయక్ ను విడుదల చేయబోతుండగా.. వచ్చే సమ్మర్ లో హరి హర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది.