నందమూరి కుటుంబంలో మరో విషాదం. నందమూరి హరికృష్ణ (61) నేటి ఉదయం జరిగిన కార్ యాక్సిడెంట్‌లో మరణించారు. కొద్ది సేపటి క్రితం అద్దంకి- అనేపర్తి సమీపంలో హైవై పై భారీ యాక్సిడెంట్ జరగడంతో హరికృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయన్న వార్త పెనుప్రకంపనం సృష్టించింది. ఈ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో, సినీ, రాజకీయ వర్గాల్లో కంగారు మొదలైంది. ఆయనకు ఏమైంది? అన్న ఆరాలు మొదలయ్యాయి.
యాక్సిడెంట్ అనంతరం ఆయనను కామినేని ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స అందించే ప్రయత్నం చేస్తుండగానే ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అంటే హైవేలో వెళుతున్న హరికృష్ణ కార్ వేరొక కార్‌ని ఓవర్‌టేక్ చేయబోతుంటే అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. ఆ క్రమంలోనే కార్ సినీపక్కీలో అంత ఎత్తుకు ఎగిరిపడిందని టీవీ9 రిపోర్ట్‌లో వెల్లడించారు. హరికృష్ణ కన్నుమూశారన్న వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నెల్లూరు- కావలిలోని ఓ అభిమాని కుమారుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తలకు, ఒళ్లంతా తీవ్ర గాయాలు అవ్వడంతో ఆయన తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని సినీవర్గాలు దేవుని ప్రార్థిస్తున్నాయి. అయితే ఘటనా స్థలిలో ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ఏంటనేది తెలియాల్సి ఉంది.