నందమూరి బాలకృష్ణ హీరోయిన్ విలన్ తో డేటింగ్ లో వుందా? .. గత కొంత కాలంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని జంటగా తిరుగుతున్నారా?. ఇరువురి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారా? అంటే శాండల్ వుడ్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కన్నడ క్రేజీ హీరోయిన్ హరి ప్రియ గత కొంత కాలంగా విలన్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న వశిష్ట ఎన్. సింహాతో ప్రేమలో వుందట. ఇద్దరు కలిసి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారని శాండల్ వుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
హరి ప్రియ తెలుగులో భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన 'తకిట తకిట', నేచురల్ స్టార్ నాని నటించిన 'పిల్ల జమీందార్', వరుణ్ సందేష్ 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్', నందమూరి బాలకృష్ణతో 'జై సింహా' వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కానీ ఆ తరువాత తెలుగులో హీరోయిన్‌గా కంటిన్యూ కాలేకపోయింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడం.. కన్నడలో బిజీ కావడంతో టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.
ఇక వశిష్ట ఎన్. సింహా 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో నటుడుగా, విలన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. 'కేజీఎఫ్' కారణంగా తెలుగులోనూ అవకాశాల్ని దక్కించుకున్నాడు. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప'లోనూ, హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించిన 'ఓదెల రైల్వే స్టేషన్'లోనూ నటించాడు.
ప్రస్తుతం కన్నడలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. అయితే గత కొంత కాలంగా హీరోయిన్ హరిప్రియతో వశిష్ట ఎన్. సింహా కలిసి తిరుగుతుండటంతో వీరిద్దరు డేటింగ్ లో వున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలని నిజం చేస్తూ హరిప్రియతో వశిష్ట ఎన్. సింహా సోమవారం బెంగళూరు ఏయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇద్దరూ కలిసి చేతిలో చేయి వేసుకుని కలిసి నడుస్తూ కనిపించడంతో ఫొటో గ్రాఫర్లు క్లిక్ మనిపించారట. దీనికి సంబంధించిన ఫొటోలు కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరిపై వార్తలు వైరల్ అవుతున్నా హరిప్రియ, వశిష్ట ఎన్. సింహా స్పందించలేదు. హరిప్రియ, వశిష్ట ఎన్. సింహా ఓ సినిమా సెట్ లో తొలిసారి కలుసుకున్నారట. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం మొదలైందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే తాజాగా వశిష్ట ఎన్. సింహా.. హరిప్రియతో వున్న ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతే కాకుండా 'మీకు అన్నింటికంటే ఉత్తమమైనది లభించాలని కోరుకుంటున్నాను పార్ట్నర్. మీరు ఆనందంతో ప్రేమతో ఆశీర్వదించబడాలి..మీరు మీరుగా వున్నందుకు ధన్యవాదాలు' అని పోస్ట్ చేశాడు. దీనికి హరి ప్రియ కూడా ధాంక్యూ పార్ట్నర్ రిప్లై ఇవ్వడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.