హరీష్ శంకర్ డబ్బింగ్ దగ్గరా మార్చేస్తాడట

Update: 2017-06-29 07:48 GMT
ఇప్పటి దర్శకుల్లో చాలామంది మాటలు కూడా తామే రాసుకుంటారు. టాలీవుడ్లో మంచి పంచ్ డైలాగులు రాస్తాడని పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. ‘మిరపకాయ్’.. ‘గబ్బర్ సింగ్’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాల్లో అతడి మాటలకు మంచి పేరొచ్చింది. తాజాగా కథాకథనాల పరంగా విమర్శలు ఎదుర్కొన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా విషయంలోనూ డైలాగ్స్ వరకు మంచి అప్లాజే వచ్చింది. డైలాగ్స్ విషయంలో తన మీద ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలుసు కాబట్టే తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాటలు రాస్తుంటానని హరీష్ శంకర్ వెల్లడించాడు.

డైలాగ్స్ విషయంలో తాను ఒక వెర్షన్ తో సంతృప్తి చెందనని.. ఎప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేయడానికి ప్రయత్నిస్తానని హరీష్ తెలిపాడు. సెట్లో షూటింగ్ జరుగుతున్నపుడే కాక.. డబ్బింగ్ దశలో కూడా తాను డైలాగులు మారుస్తుంటానని అతను చెప్పాడు. డబ్బింగ్ జరుగుతున్న టైంలో మంచి డైలాగ్ తడితే.. అప్పటికప్పుడు మార్చేసి ఆర్టిస్టులతో కొత్త డైలాగులు చెప్పిస్తుంటానని.. అప్పటికి షూటింగ్ అయిపోయినా తానేమీ కంగారు పడనని.. లిప్ సింక్ గురించి కూడా ఆలోచించనని.. తన సినిమాలు కొన్నింట్లో ఆర్టిస్టు పలికే మాటకు.. వినిపించే మాటకు పొంతన లేకుండా ఉండటానికి ఇదీ ఓ కారణమని.. కొన్ని సినిమాల విషయంలో ఇలా జరిగిందని హరీష్ వెల్లడించాడు. తాను అమెరికాలో ఉండే ఎన్నారైలకు అభిరుచికి తగ్గ క్లాస్ డైలాగులు.. అలాగే ఏలూరులో ఉండే మాస్ ప్రేక్షకుడి టేస్టుకు తగ్గ మాస్ డైలాగులు.. రెండూ రాసి సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తానని హరీష్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News