టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన అతి తక్కువమంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. మెగా హీరో వరుణ్ తేజ్ కు షాకింగ్ మేకోవర్ ఇస్తూ ఆయన తెరకెక్కించిన చిత్రం 'వాల్మీకి'. ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హరీష్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తుపాకి వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకుంటూనే.. తనదైన శైలిలో పంచులు కూడా వేశారు.
'వాల్మీకి'లో చాలా సర్ ప్రైజులు ఉన్నాయని చెప్పిన హరీష్ శంకర్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో కామెడీ చేయించలేదని అన్నారు. ఇది నిజంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే అంశమే.. ఈ విషయంపై ఇంటర్వ్యూయర్ "ఈ సినిమాలో ఎందుకు కామెడీ చేయించలేదు?" అని ప్రశ్నిస్తే "ఇదే విషయాన్ని బ్రహ్మానందం గారు సినిమాలో అడుగుతారు. 'అందరూ నాచేత కామెడీ చేయిస్తారు. మీరు సీరియస్ చేయించారు ఎందుకు' అంటారాయన. అక్కడ మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే తుపాకి పాఠకులు అందరూ రేపు ఇరవైవ తేదీ మీకు దగ్గర ఉన్న థియేటర్లలో 'వాల్మీకి'ని చూడండి" అన్నారు.
ఇక తుపాకి వాళ్ళు సినిమాను చూస్తారని తనకు తెలుసనీ.. ఎందుకంటే సినిమాలో అందరికంటే ముందుగా బొక్కలు వెతికేది వాళ్ళేనని.. సినిమాలో లక్షా తొంభై తప్పులు వెతికి పట్టుకుంటారని తుపాకీపై తన ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇవన్నీ సాధారణమైన ప్రశ్నలు సాధారణమైన సమాధానాలే. కానీ హరీష్ మార్క్ సమాధానం మాత్రం నెక్స్ట్ ప్రశ్నకే లభించింది.
"సర్ మీరు ఎప్పుడూ ఒక్క సినిమాలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు?" అని ఇంటర్వ్యూయర్ అడిగితే.. "మనం అబద్ధం ఆడినా అద్దం అబద్ధం ఆడదు కదా? అద్దం చూసుకున్నప్పుడు మనం దేనికి పనికొస్తామో మనకు తెలుస్తుంది. మా ఇంట్లో అద్దాలు ఉన్నాయి! ఐ కాంట్ ఇగ్నోర్ మిర్రర్!!" అన్నారు. అంతటితో ఆగితే హరీష్ శంకర్ చమత్కారం ఎలా తెలుస్తుంది? ఆ జవాబును జీడిపాకంలా కొనసా..గించి "డైరెక్షన్ లోనే వంద వంకలు పెడుతుంటారు మీ సైట్ వాళ్ళు. అదే నేను కనుక స్క్రీన్ మీదకు వస్తే మీరు నన్ను వదులుతారా? కేవలం మీ తుపాకి వెబ్ సైట్ కు భయపడే నేను యాక్టింగ్ చేయట్లేదు" అంటూ 'ఘ'ట్టి నిందవేశారు.
'గబ్బర్ సింగ్' డైరెక్టర్ నుంచి ఇంత పెద్ద నిందను స్వీకరించడం ఎవరికైనా కష్టమే.. అందుకే "ఈ బిట్ కట్ చేయాలా సర్" అని హరీష్ గారిని అడిగితే.. "ఈ బిట్ కట్ చేయొద్దు... తుపాకి ప్రేక్షకులకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కేవలం నా యాక్టింగ్ గురించి రేపు తుపాకీ వెబ్ సైట్ వాళ్ళు ఏం రాస్తారో అన్న భయంతోనే నేను యాక్టింగ్ చేయట్లేదు" అంటూ ముగించారు.
Full View