‘సరైనోడు’కు నాలుగు రెట్ల వసూళ్లా?

Update: 2017-06-25 07:12 GMT
దువ్వాడ జగన్నాథం’ విషయంలో రివ్యూలకు రెవెన్యూలకు సంబంధం లేదంటూ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు హరీష్ శంకర్. ఒకప్పుడు హరీష్ శంకర్ తన సినిమాలకు వచ్చిన పాజిటివ్ రివ్యూల లింకుల్ని షేర్ చేస్తూ.. క్రిటిక్స్ ఫీడ్ బ్యాక్ కు చాలా ప్రాధాన్యం ఇవ్వడం సోషల్ మీడియాలో అతణ్ని ఫాలో అయినవాళ్లెవరూ మరిచిపోలేరు. కానీ ఇప్పుడు మాత్రం రెవెన్యూనే కీలకం అంటున్నాడు. మంచి హైప్ మధ్య రిలీజైన ఏ పెద్ద సినిమాకైనా తొలి రోజు.. తొలి వారాంతంలో భారీ వసూళ్లే వస్తాయని అందరికీ తెలుసు. సినిమా అసలు సత్తా ఏంటన్నది సోమవారమే తేలుతుంది. ఐతే తొలి రోజు బన్నీ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రావడం చూసి హరీష్ భారీ స్టేట్మెంట్ ఇచ్చేస్తుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.

ఫుల్ రన్లో ‘సరైనోడు’ కలెక్షన్లను ‘డీజే’ దాటేస్తుందనడమే అతిశయోక్తిలా కనిపిస్తుంటే.. ‘సరైనోడు’ కంటే నాలుగు రెట్లు గ్రాస్ వస్తుందంటూ డిస్ట్రిబ్యూటర్లు తనకు ఫోన్ చేశారని హరీష్ అనడం మరీ విడ్డూరంగా ఉంది. ‘సరైనోడు’కు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. మరి ‘డీజే’ రూ.400 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఎవరో అంటే దాన్ని హరీష్ నమ్మడం.. ప్రెస్ మీట్లో ఘనంగా చెప్పుకోవడం టూమచ్. హరీష్ అంతటితో ఆగకుండా ‘డీజే’కు పెద్ద నెగెటివ్ అని అందరూ అంటున్న ద్వితీయార్ధం గురించి గొప్పగా చెబుతున్నాడు. తన కెరీర్లో ఇదే బెస్ట్ సెకండాఫ్ అని ఫీడ్ బ్యాక్ వస్తోందన్నాడు. క్లైమాక్స్ అద్భుతమని.. చాలా కొత్తగా ఉందని అంటున్నారని కూడా హరీష్ చెప్పుకొచ్చాడు. ‘డీజే’ క్లైమాక్స్ దెబ్బకు జనాలకు దిమ్మదిరిగిపోతోందన్నది మెజారిటీ జనాల నుంచి వినిపిస్తున్న టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News