దువ్వాడ జగన్నాధం.. మోస్ట్ ఎంటర్టెయినింగ్ కేరక్టర్ ఇన్ ది వరల్డ్.. ఇది డీజే మూవీ లేటెస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో ఇలాంటి డైలాగ్ చెప్పించడం అంటే.. డైరెక్టర్ కి బోలెడంత కాన్ఫిడెన్స్ ఉండాలి. సినిమాలో అంత స్థాయిలో నవ్వులు పూయించి ఉండాలి. అయితే.. డీజే ట్రైలర్లు చూస్తే యాక్షన్ బాగా దట్టించాడని అనిపించక మానదు.
కానీ దువ్వాడ జగన్నాధం మూవీ టాలీవుడ్ ఫార్ములాల ప్రకారం ఉండదని చెబుతున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. 'సహజగం మన దర్శకులు కొన్ని యాక్షన్ సీన్స్.. సాంగ్స్.. క్లైమాక్స్.. ఇలా ఒక టెంప్లేట్ ప్రకారం తీస్తారు. కానీ డీజే విషయంలో మాత్రం డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటుందని ముందే అల్లు అర్జున్ కి చెప్పాను. ఆయన దానికి అంగీకరించారు కూడా. జనాలను చివరి నిమిషం వరకూ థియేటర్లలో కూర్చోబెట్టగలననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. హీరోయిజం కోసం ఏదేదో చేయాల్సిన పని లేదని నాకు బన్నీ ముందే చెప్పారు. ఈ సినిమా రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి' అంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు హరీష్ శంకర్.
'నా మైండ్ లో ఈ స్టోరీ మూడేళ్ల నుంచి ఉంది. అల్లు అర్జున్ అయితేనే కరెక్ట్ గా సరిపోతాడనే ఉద్దేశ్యంతో వెయిట్ చేశాను. ఈ స్టోరీ నెరేట్ చేసినపుడు బన్నీ చాలా థ్రిల్ అయ్యాడు. తను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లుగానే అనేక మంది బ్రాహ్మణులతో రోజూ ఇంటరాక్ట్ అవుతూ భాషపై పట్టు పెంచుకున్నాడు' అని చెప్పిన డీజే డైరెక్టర్.. శంకర్ తీసిన జంటిల్ మ్యాన్ తో ఈ చిత్రాన్ని పోల్చడాన్ని ఖండించాడు. అయితే.. శంకర్ సినిమాలు చూస్తూ పెరిగిన తను తీసిన మూవీని.. అలాంటి బిగ్ డైరెక్టర్ తో పోల్చడాన్ని కాంప్లిమెంట్ అనడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/