హరీష్ శంకర్.. కత్తిలాంటి డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్నాడు. పవన్ సహా వరుణ్ తేజ్ లాంటి వారిని ఫుల్ మాస్ గా చూపించడంలో ఆయనది అందేవేసిన చేయి. ట్విట్టర్ వేదికగా సామాజిక అంశాలపై చెలరేగిపోతుంటాడు. పౌరుషమైన డైలాగులకు పెట్టింది పేరు..
తాజాగా హరీష్ శంకర్ సంచలన ట్వీట్ చేశారు. పౌర, మానవ హక్కుల సంఘాలపై తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇటీవల కాలంలో ప్రాణాలకు తెగించి మరీ కరోనా పై పోరాడుతున్న వైద్యులపై కొందరు దాడులకు దిగడంపై హరీష్ నిప్పులు చెరిగారు.
తాజాగా గాంధీ ఆస్పత్రి లో వైద్యులపై దాడులు జరిగాయి. దీనిపై సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఘటనను ఖండించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్యులపై సానుభూతి పెరిగింది.
డాక్టర్లపై దాడులకు మనస్తాపం చెందిన దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. 'డాక్టర్లు, నర్సులు..... పోలీస్ లు.. పౌరులు, మానవులు కాదా..!!? నిన్న జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు...!! సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం.. తోసుకుంటూ ముందుకొస్తారు..' అంటూ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు.
ఇప్పుడే కాదు.. గతంలో కూడా సామాజిక - ప్రస్తుత ప్రజా సంబంధిత అంశాలపై హరీష్ ఇలాంటి అస్త్రాలే సంధించారు.