పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో అభిప్రాయ భేధాలు ఉన్నాయని ప్రచారమైంది. కానీ నేను అంతటివాడిని కానేకాను. నేను ఆయన అభిమానిని. ఓ అభిమానికి అభిప్రాయ భేధాలు ఉండవు. అయినా నాది పవన్‌ని అనే స్థాయి కాదు. అంత పెద్ద హీరోతో నేను అలా ప్రవర్తిస్తానని ఎలా అనుకుంటారు. ఏవైనా అభిప్రాయ భేధాలు ఉంటే అది నా అసిస్టెంట్ లతో మాత్రమే. పవన్ కల్యాణ్ ఎక్కడో శిఖరంపై ఉన్నారు. నేను నేలపై ఉన్నాను. నా గురించి తప్పుగా అనుకున్నారంతా.. అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్.
''అసలు పవన్ ని చూసి చాలా నేర్చుకున్నా. గబ్బర్ సింగ్ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ వచ్చాక మూడు రోజులకు ఆయన్ని కలిశాను. అప్పుడు ఆయన చాలా సింపుల్ గా ఇప్పుడేం చేస్తున్నావ్. రైట్ నవ్ ఏం చదువుతున్నావ్? ఎలా అప్ డేట్ అవుతున్నావ్ అంటూ మాట్లాడారు. కలెక్షన్ ల గురించి, రికార్డుల గురించి అస్సలు ప్రస్థావనే తేలేదు. అప్పట్నుంచే పర్వతాన్ని చేరుకునే ప్రతి సెకను ఆస్వాధించడం అలవాటు పడ్డాను. ఇది వైరాగ్యం కాదు, వేదాంతం. పవన్ వల్ల వచ్చిన మార్పు ఇది.'' అని తెలిపాడు హరీశ్.
ఒక అభిమానిగా నేను ఆయన గురించి ఎలాంటి తప్పును మాట్లాడలేను. అయినా పవన్ కోసం ఓ అద్భుతమైన కథ రాస్తున్నా. గబ్బర్ సింగ్ 2 కోసం అవకాశం ఇవ్వలేదని నేనేమీ ఫీలవ్వలేదు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 తెరకెక్కిస్తున్న బాబి నా స్నేహితుడు. నేను జిఎస్ దర్శకత్వం వహించినప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో, అతడు జిఎస్ 2 తెరకెక్కిస్తూ అంతే ఎగ్జయిట్ మెంట్ తో ఉండి ఉంటాడు.. అంటూ హరీష్ ఎమోషనల్ మాట్లాడారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ప్రమోషన్ లో హరీష్ శంకర్ ఈ మాటలు అన్నారు.