హరీష్ శంకర్ 'అద్దె' పంచ్

Update: 2016-11-14 10:32 GMT
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడింది. తనకు కొంత సమయం ఇవ్వమంటూ ఏకంగా ప్రధానమంత్రే ఎమోషనల్ అయిపోవాల్సి వచ్చింది. ఇలా నోట్లను రద్దు చేయడాన్ని సపోర్ట్ చేసే వారి కంటే.. వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే.. ఈ నిర్ణయం కరెక్టే అయినా.. రాబోయే సమస్యలను ముందుగా ఊహించి కాసిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అంటున్నారు.

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై సపోర్టర్స్ పంచ్ లు సోషల్ మీడియాలో బాగానే పేలుతున్నాయి. ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇలాంటి ఓ పోటోను ట్వీట్ చేశాడు. 'జియో సిమ్ కోసం 1కిలోమీటరు లైన్.. నో ప్రాబ్లెం. ఐఫోన్ కోసం క్యూలో 8 గంటలు.. నో ప్రాబ్లెం. మెగాసేల్ కోసం 4-5 గంటలు.. నో ప్రాబ్లెం. రోడీస్ ఆడిషన్ కోసం 4కిలో మీటర్ల లైన్.. నో ప్రాబ్లెం. కానీ భవిష్యత్తు బాగుపడేందుకు బ్యాంకు బయట క్యూలో నించునేందుకు మాత్రం సిద్ధంగా ఉండరు' అంటూ రాసిఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు హరీష్ శంకర్.

ఈ ఒక్క ఫోటోను పెట్టడంతో.. ఈ దర్శకుడు మోడీని సపోర్ట్ చేస్తున్నాడనే విషయం అర్ధమవుతుంది. సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందించేందుకు అంత సన్నద్ధత చూపించకపోవడం.. బ్లాక్ మనీ ఇష్యూతో టాలీవుడ్ లో చాలామంది సతమతం అవుతున్న టైమ్ లో.. పవర్ ఫుల్ పంచ్ డైలాగుల హరీష్ శంకర్ వేసిన 'అద్దె' కౌంటర్ బాగానే పేలింది. అంటే సొంతంగా రాసింది కాదు.. అద్దెకు తెచ్చుకుందేగా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News