ఆవేశంలో డీజే స్టోరీ చెప్పేశాడా?

Update: 2017-06-05 06:02 GMT
అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధం మూవీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తెలుగు సంస్కృతి పదాలతో కలిపి సాహితి రాసిన 'అస్మైక భోగ' పాటకు పొగడ్తలు వచ్చినా.. అదే సమయంలో బ్రాహ్మణ సమాజం నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కొన్ని వాక్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని నిరసన కూడా వ్యక్తం చేశారు.

అయితే.. ఈ వివాదాన్ని రూపు మాపేందుకు సమాధానం ఇస్తూ.. తాను ఓ బ్రాహ్మణుడినే అంటూ ఆవేశంగా మాట్లాడాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో భాగంగా డీజే కథను చూచాయగా చెప్పేశాడు కూడా. 'శాపాదపీ శరాదపీ' అనే అంశంపై దువ్వాడ జగన్నాధం కథ ఉండనుందట. అంటే.. ఒక బ్రాహ్మణుడికి కోపం వస్తే.. శాపంతో కానీ.. బాణంతో కానీ గెలుపు సాధిస్తాడు. అదే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని దువ్వాడ జగన్నాధం కథ రూపొందించినట్లు తెలుస్తోంది. సమాజానికి కీడు చేసే వ్యక్తులను శపించిన ఓ బ్రాహ్మణుడు.. వాటిని నెరవేర్చేందుకు ఏం చేశాడనేదే.. డీజే కథ అనే విషయాన్ని ఇన్ డైరెక్టుగా చెప్పేశాడు హరీష్ శంకర్.

తెలుగు సినిమాల్లో చివరకు హీరో గెలవడం అనేది కామన్ పాయింట్ కాబట్టి.. ఎలా గెలిచాడన్నదే మెయిన్ పాయింట్ కానుంది. ఈ నెల 23న దువ్వాడ జగన్నాధం థియేటర్లలోకి వచ్చేయనుంది. ఈరోజు సాయంత్రం 7.30 కి ట్రైలర్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను ఫుల్ స్పీడ్ లో ఫినిష్ చేసేస్తున్నారు దువ్వాడ జగన్నాధం టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News