సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వార్తలపై టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ చురకలంటించారు. మీడియాపై, ఓ జర్నలిస్టుపై హరీష్ శంకర్ చేసిన కామెంట్లు, కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. మనసులో మాటను బయటకు కక్కేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయన్ను చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిపింది.
తాజాగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ వివాదంలో కూడా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సాయిధరమ్ తేజ్, స్కిడ్ కావడంతో అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ యాక్సిడెంట్ కు మసాలా దట్టించి.. ఉన్నది లేదని కల్పించి కొన్ని మీడియా సంస్థలు కాస్త అతి చేస్తూ వార్తలు రాశాయన్న విమర్శలు సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తున్నాయి. అతి వేగం అని కొందరు, ఇద్దరి మధ్య రేసింగ్ అని ఇంకొందరు రాసేశారు. దీంతో ఈ వార్తలపై స్పందించిన హరీష్ ఓ సెటైరికల్ మెసేజ్ పెట్టారు.
‘హ్యాట్సాఫ్ తమ్ముడు సాయిధరమ్ తేజ్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరూ బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను’ అని పేర్కొంటూ హరీష్ శంకర్ ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ కౌంటరిస్తున్నారు. హరీష్ కు మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.
హరీష్ చేసిన ఈ ట్వీట్ చూసి ఓ ప్రముఖ మీడియా సీనియర్ జర్నలిస్ట్ స్పందించారు. కౌంటర్ ఇచ్చాడు. ‘మీడియా వాళ్లను విమర్శించడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు, కథనాలు, హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరూ కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడుతారు. అతివేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు’ అని ఘాటు ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు హరీష్ శంకర్. ‘నేను తప్పుడు వార్తలు అని క్లియర్ గా మెన్షన్ చేశాను కదా.. మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు. అంటే ఒప్పుకున్నట్టేనా? క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ మరో గట్టి షాక్ ను సదురు జర్నలిస్ట్ కు ఇచ్చాడు.
ఇక మరో ట్వీట్ లో ‘ఇకపోతే మా సినిమాల్లో హింస అన్నారు. మాకు సెన్సార్ ఉంది. మేము వాళ్లకు జవాబు చెప్పాలి. మీకేముందు మీరు దేనికి జవాబు చెప్పాలో కాస్త చెబుతారా? నేను మీ వ్యవస్థను తప్పు పట్టడం లేదు. వ్యవస్థను తప్పుదోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నాను. దయచేసి ఇష్యూను అర్థం చేసుకోండి’ అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి.