పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - బల్లాలదేవుడు రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మూవీ `భీమ్లా నాయక్`. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు శుక్రవారంతో తెరపడింది. `భీమ్లా నాయక్` తెరపైకొచ్చింది. ఫ్యాన్స్ చేస్తున్న పూన కాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో వున్న థీయేటర్లన్నీ దద్దరిల్లిపోతున్నాయి. పవన్ స్ట్రోమ్ ఓ రేంజ్ లో థియేటర్లలో హల్ చల్ చేస్తోంది. చాలా రోజుల తరువాత పవన్ నుంచి వస్తున్న పవర్ ప్యాక్ట్ పెర్ఫార్మెన్స్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరి నుంచే సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లని రాట్టిన `భీమ్లా నాయక్` ఎలా వుండబోతోంది?
ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వుండబోతున్నాయి? అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ..`భీమ్లా నాయక్`పై షాకింగ్ కామెంట్ లు చేశారు. పవన్ సినిమా వచ్చేస్తోందంటే అభిమానుల తరహాలో తను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడన్నది తెలిసిందే. `భీమ్లా నాయక్` రిలీజ్ కోసం కూడా హరీష్ శంకర్ ఎదురుచూశాడు.
తన అభిమాన హీరో పవన్ నటించిన `భీమ్లా నాయక్` పై హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమాపై హరీష్ శంకర్ ట్విట్టర్ వేదిగా రివ్యూ ఇచ్చేశారు. `కొంచెం గ్యాప్ తరువాత గర్జించే పవన్ కల్యాణ్ ని చూశాను. దర్‌శకుడు సాగర్ చంద్ర, త్రివిక్రమ్ పనితీరు అద్భుతం. నాగవంశీ అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు. తమన్ బావ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
తన కెరీర్ లో బెస్ట్ వర్క్ ఇచ్చాడు. ఇది కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు..భీమ్లాకి బ్యాక్ బోన్...లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రానా గురించి చెప్పాలి.. నేను రానాని చూడలేదు. డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాను. దీని తరువాత ప్రతి ఒక్కరూ `రానా నీ ఫ్యాన్స్ వేటింగ్ ఇక్కడ` అంటారు. అని హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్` పై రివ్యూ ఇచ్చేశారు.
హరీష్ శంకర్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా తను రూపొందించిన `గబ్బర్ సింగ్` తరువాత ఆ స్థాయికి మించిన మాస్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించారని, థియేటర్లు రికార్డుల మోతతో ఇక మోగిపోవడం మొదలైందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ చెప్పినట్టే `భీమ్లా నాయక్` లో కొత్త పవన్ కల్యాణ్ ని చూశామని, అయినలోని మాస్ ఉగ్రరూపం ఈ సినిమాలో కనిపించిందని ఫ్యాన్స్ కామెంట్ లు పెడుతున్నారు.