సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతారనే విషయం అందరికి తెలిసిందే. ఇక మన టాలీవుడ్ లో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ హీరోయిన్ ని తీసుకుంటే సినిమా ప్లాప్ అవుతుందని.. ఆ డైరెక్టర్ తో సినిమా తీస్తే నెక్స్ట్ హిట్ రావడానికి చాలా కాలం పట్టుద్దని.. ఇలా రకరకాల సెంటిమెంట్స్ నమ్ముతుంటారు. అయితే అవన్నీ మూఢ నమ్మకాలని వాటిని బ్రేక్ చేసి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ నిజమేమో అనే డౌట్ వచ్చేలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి కూడా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ని బలంగా నమ్ముతుంటారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ అందుకోగా మరికొన్ని అట్టర్ ప్లాప్స్ గా మిగిలిపోయాయి. పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి రెండో సినిమా చేసే ఛాన్స్ ఇస్తుంటాడు. పవన్ ఏ డైరెక్టర్ తోనైనా హిట్ కొట్టి.. మళ్ళీ ఆ డైరెక్టర్ తో రెండో మూవీ చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో వర్గాల్లో ఉంది. దీనిని నిజం చేస్తూ ఆయన సినిమాలు అలాంటి ఫలితాన్నే ఇచ్చాయి.
పవన్ కళ్యాణ్ - భీమినేని శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'సుస్వాగతం' సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. అయితే వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా 'అన్నవరం' ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన 'తొలిప్రేమ' టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని అందుకుంది. అయితే వీరి కలయికలో వచ్చిన సెకండ్ మూవీ 'బాలు' ఘోర పరాజయాన్ని చవి చూసింది. అలానే 'ఖుషీ' సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఎస్.జే. సూర్య 'కొమరం పులి' లాంటి డిజాస్టర్ మూవీ ఇచ్చాడు. 'బద్రీ' లాంటి మెమొరబుల్ సినిమా ఇచ్చిన పూరీ జగన్నాథ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అనే ప్లాప్ సినిమా తీసాడు. అంతేకాకుండా 'గోపాలా గోపాలా' సినిమా తీసిన డాలీ (పార్థ సారధి) 'కాటమ రాయుడు' లాంటి పరాజయాన్ని ఇచ్చాడు.
కాగా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 28వ సినిమాని లైన్లో పెట్టాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రాబోయే రెండో సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ తో 'జల్సా' సినిమా తీసిన త్రివిక్రమ్ 'అత్తారింటికి దారేది' సినిమా ఇచ్చాడు. అంటే త్రివిక్రమ్ పీకే సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సెకండ్ మూవీ హిట్ కొట్టాడు. మరి ఇప్పడు హరీష్ శంకర్ త్రివిక్రమ్ లాగా పీకే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా లేదా ఆ సెంటిమెంటుకి బలవుతాడా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.