మాజీ గాళ్ ఫ్రెండ్ ఇంట్లో హీరో మకాం

Update: 2016-05-19 19:30 GMT
బాయ్ ఫ్రెండ్ తోనో - గాళ్ ఫ్రెండ్ తోనో బ్రేకప్ అయిపోతే.. వారితో మాట్లాడ్డానికి కూడా సాధారణంగా ఇష్టపడరు. ఇక ఒకే ఇంట్లో కలిసి ఉండడమంటే అది అసాధ్యమని చెప్పాలి. కానీ ఇప్పుడో హీరో ఇదే చేస్తున్నానని చెబుతున్నాడు. పైగా తన మాజీ గాళ్ ఫ్రెండ్-ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటున్నానని చెప్పడం విశేషం. హర్షవర్ధన్ రాణే.. తెలుగులో చేసిన సినిమాల సంఖ్య బాగానే ఉన్నా.. ఆశించినంత పేరు రాలేదు.

అలాంటి సమయంలో ఓ బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టడంతో ఎంచక్కా వెళ్లిపోయాడు. సనమ్ తేరీ కసమ్ చిత్రం.. భారీ హిట్ సాధించకపోయినా యావరేజ్ అనిపించుకుంది. అంతో ఇంతో గుర్తింపు హర్షవర్ధన్ రాణేకు కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత మూడు ఆఫర్లు వరుసగా తలుపు తట్టడంతో వెంటనే తన మకాం ముంబైకి మార్చేశాడు ఈ హీరో. ఇలా ముంబై వెళ్లేప్పుడు హైద్రాబాద్ లో ఫ్లాట్ అమ్మేశాడనే టాక్ వచ్చింది.

'నాకు అసలు హైద్రాబాద్ లో ఫ్లాట్ లేదు. ఇక్కడ ఉన్నన్నాళ్లు హోటల్ రూమ్స్ లోనే ఉన్నాను. ఇప్పుడు ముంబైలో కూడా నాకు సొంత ఇల్లు లేదు. అక్కడ నా మాజీ గాళ్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం నా మకాం వాళ్లింట్లోనే' అంటున్నాడు హర్షవర్ధన్ రాణే. ఎక్స్ గాళ్ ఫ్రెండ్ వేరే బాయ్ ఫ్రెండ్ తో ఉంటే.. ఆ పక్క రూమ్ లో ఇతగాడు ఉంటాడట. వీళ్లందరిదీ బాగా బ్రాడ్ మైండ్ కదూ.
Tags:    

Similar News