ఛాన్స్‌ కోసం పడుకున్న వారు ఇప్పుడు మీటూ...!

Update: 2018-10-26 01:30 GMT
మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది ప్రముఖులు లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ లో మొదలైన ఈ లైంగిక వేదింపుల ఆరోపణల ఉద్యమం ఇప్పుడు సౌత్‌ కు చేరింది. ఎన్నో సంవత్సరాలుగా నోరు మూసుకుని ఉన్న హీరోయిన్స్‌, ఇతర మహిళలు మీటూ ఉద్యమం నేపథ్యంలో మీడియా ముందుకు వస్తున్నారు. అయితే మీటూ ఉద్యమం ముసుగులో కొందరు పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నటి హర్షిక పునాచా మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్న కొందరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

హర్షిక ఏ ఒక్కరి పేర్లను బయట పెట్టకుండా ఇండైరెక్ట్‌ గా పలువురిని టార్గెట్‌ చేస్తూ వచ్చింది. తాజాగా కన్నడకు చెందిన ఒక స్టార్‌ హీరోయిన్‌ ఒక స్టార్‌ హీరోపై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో హర్షిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరింతగా వివాదాన్ని పెంచుతున్నాయి.

ఇంతకు హర్షిక ఏమన్నదంటే.. కొందరు హీరోయిన్స్‌ తమ కెరీర్‌ ఆరంభంలో సినిమాల్లో అవకాశాల కోసం, డబ్బు, సెలబ్రెటీ స్టేటస్‌, విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవితం కోసం మగాళ్లను వాడుకుని, వారికి ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. అప్పుడు డబ్బు కోసం ఫ్రీడమ్‌ ఇచ్చి, ఇప్పుడేమో పబ్లిసిటీ కోసం వారిపైనే మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు మగాళ్ల మీద చేయి వేసి మాట్లాడిన హీరోయిన్స్‌ ఇప్పుడు ఆ మగాడి చేయి తాకింది అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్నారని హరిక ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వ ప్రయోజనాల కోసం వారితో పడుకున్నప్పుడు మీటూ గుర్తు రాలేదు కాని, ఇప్పుడు పబ్లిసిటీ కోసం వారికి మీటూ ఉద్యమం గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించింది. ఒక నిర్మాత నాకు కొన్ని రోజుల క్రితం ఒక వీడియోను చూపించాడు. ఆ వీడియోలో ఇప్పుడు మీటూ ఉద్యమంలో పాల్గొంటున్న హీరోయిన్‌ ఉంది. ఆమె గంజాయి సేవిస్తూ ఒక వ్యక్తితో అర్థ నగ్నంగా ఉంది. అతడిపై చేతులు వేసి నాకు సినిమా ఛాన్స్‌ కావాలని అడుగుతూ ఉంది. అలాంటి వారు ఇప్పుడు స్టార్స్‌ పై లైంగిక ఆరోపణలు చేయడంను హర్షిక కొట్టిపారేసింది.

మీటూ ఉద్యమానికి నేను వ్యతిరేకం కానే కాదు. కాని మీటూ పేరుతో పబ్లిసిటీ ని దక్కించుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు. వారికి నేను వ్యతిరేకం అంటూ హర్షిక పేర్కొంది. హర్షిక కామెంట్స్‌ ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆమె పేరు పెట్టకుండా విమర్శలు చేసినా కూడా అవి తగిలే వారికి తగులుతున్నాయి అంటూ కన్నడ సినిమా పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News