కొత్త కుర్రాడితో దీపిక రొమాన్స్?

Update: 2016-10-03 05:03 GMT
సీనియర్ హీరోయిన్లు స్టార్ హీరోలతోనే చేయాలి.. కొత్త కుర్రాళ్లు పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్స్ ను వెతుక్కొచ్చుకోవాలి లాంటి రూల్స్ ఏమీ బాలీవుడ్ లో కనిపించవు. కేరక్టర్స్ నచ్చాలి కానీ.. కొత్త కొత్త కాంబినేషన్స్ రెడీ అయిపోతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ స్టేజ్ లో వెలిగిపోతున్న దీపికా పదుకొనే.. ఇప్పుడు అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ తో జత కట్టనుందనే న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

బద్లాపూర్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ త్వరలో ఓ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనుండగా.. ఈ మూవీకి మేల్ లీడ్ రోల్ ను హర్షవర్ధన్ కపూర్ గా ఫైనల్ చేశాడని అంటున్నారు.  హీరోయిన్ గా దీపిక పదుకొనే చేయనుంది. దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడంతో పాటు.. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ ఫినిష్ చేసేస్తానని అన్నాడట దర్శకుడు. ప్రస్తుతం హాలీవుడ్ కమిట్మెంట్స్ ని కూడా చూసుకుంటే.. ఈ రేంజ్ స్పీడ్ లో సినిమా ఫినిష్ అవనుడండంతో.. దీపిక పాజిటివ్ గా రియాక్ట్ అయిందని అంటున్నారు. అయితే.. హర్షవర్ధన్ కపూర్ తో జోడీ కట్టడం వెనక మాత్రం రణవీర్ సింగ్ హ్యాండ్ ఉందని అంటున్నారు.

వరుసకు ఈ హర్షవర్ధన్ కపూర్.. దీపికా లవర్ రణవీర్ సింగ్ కు చుట్టమే అవుతాడు లెండి. అలా ఈ అప్ కమింగ్ హీరోకి..దీపికతో  సరాగాలడే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News