గే ట్వీట్ కు యంగ్‌ హీరో రెస్పాండ్‌

Update: 2021-09-26 23:30 GMT
హీరోగానే నటిస్తాను అని కాకుండా కొందరు మంచి పాత్రలను అందిపుచ్చుకుంటూ చేసే సినిమాలతో వారికి మంచి గుర్తింపు వస్తుంది. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు హర్షవర్థన్ రాణె. ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుస ప్రాజెక్ట్‌ ల్లో నటిస్తున్న ఈయన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. తెలుగులో కూడా ఈయనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈయన ఒక ట్వీట్‌ కు ఇచ్చిన రిప్లై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందరు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు. సాదారణ వ్యక్తికి రిప్లై ఇచ్చి ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు.. కాని ఇతడు ఒక గే ఫ్యాన్ కు రిప్లై ఇచ్చాడు. గే అయినా మరెవ్వరైనా కూడా నాకు అనవసరం నా అభిమాని అన్నారు కనుక మీకు నా బిగ్‌ హగ్ అంటూ హర్ష వర్థన్ ఇచ్చిన రిప్లై సూపర్‌.

ఇటీవల నవీన్ కుమార్‌ అనే ఒక తమిళ గే ట్విట్టర్ లో.. డియర్ హర్షవర్థన్ సర్‌ నేను ఒక గే ను. నేను తమిళనాడుకు చెందిన మీ యొక్క పెద్ద అభిమానిని. మీరు నా యొక్క ఇన్సిపిరేషన్‌. నేను చాలా విషయాల్లో మీ యొక్క జర్నీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటాను. మీరు దయచేసి తమిళ సినిమాల్లో నటించండి. దయచేసి మీరు నా ట్వీట్‌ కు రిప్లై ఇవ్వండి. నేను మీ యొక్క రిప్లై కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది. నవీన్ కుమార్ ట్వీట్‌ కు హర్షవర్థన్ రిప్లై ఇచ్చాడు. గే అయినా కాకున్నా మీకు పెద్ద హగ్గు బ్రదర్‌.. నాకు తమిళ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ధనుష్‌ సర్‌ సినిమాలోని పాటలు అంటే చాలా చాలా ఇష్టం అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది.

వీరిద్దరి ట్వీట్స్ ను నెటిజన్స్ తెగ ఫాలో అయ్యారు. ఒక యంగ్‌ హీరో సోషల్‌ మీడియాలో ఒక సామాన్యమైన వ్యక్తికి రిప్లై ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది కాకుండా ఒక గే కు రిప్లై ఇవ్వడం చాలా మంచి పరిణామం. కొందరు ఇలాంటి రిప్లై లు ఇవ్వడానికి మొహమాట పడుతారు.. కొందరు సిగ్గుతో రిప్లై ఇచ్చేందుకు ఆసక్తి చూపించరు. మరి కొందరు మాత్రం జనాలు ఏమనుకుంటారో అనే అనుమానంతో రిప్లై ఇవ్వరు. మొత్తానికి హర్షవర్థన్‌ మాత్రం రిప్లై ఇచ్చి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.
Tags:    

Similar News