తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరో పాత్రలు పోషించే నటుడిగా హర్షవర్ధన్ రాణె కొన్నేళ్లుగా బండి లాగిస్తూ వచ్చాడు. కానీ అవేవీ అతడికి మంచి పేరు సంపాదించి పెట్టలేదు. గత ఏడాది కాలంలో అతను చేసిన అనామిక - మాయ - అవును-2 సినిమాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. దీంతో హర్షవర్ధన్ టాలీవుడ్ కెరీర్ దాదాపుగా ముగిసిసోయే పరిస్థితి వచ్చింది.
ఇలాంటి సమయంలో అనుకోకుండా బాలీవుడ్ అవకాశాలు వరించడంతో గాల్లో తేలిపోతున్నాడు హర్షవర్ధన్. బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాంకు రాణె భలేగా నచ్చేసి.. తన బేనర్లో వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు జాన్. అందులో ‘సాత్రోంకీ షాది హై’ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. అది త్వరలోనే పూర్తవుతుంది.
జాన్ లాంటి అభిరుచి ఉన్న నిర్మాత ఛాన్స్ ఇచ్చాడంటే హర్షవర్ధన్ లో స్పెషల్ టాలెంట్ ఏదో ఉండి ఉంటుందని వేరే నిర్మాతలు కూడా అతడిపై ఓ కన్నేస్తున్నారు. దర్శక ద్వయం రాధికా రావు, వినయ్ సప్రు డైరెక్ట్ చేయబోతున్న సనమ్ తేరీ కసమ్ సినిమాలో జాన్ ను హీరోగా ఎంచుకున్నారు. పాకిస్థానీ నటి మావ్రా హాకేన్ ఇందులో హర్ష పక్కన జోడీగా నటిస్తోంది. దీపక్ ముకుత్ నిర్మాత. రాధిక, వినయ్ ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తో ‘లక్కీ’ అనే సినిమా తీశారు. ఆ సినిమా ఫ్లాపైంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు వాళ్లిద్దరూ డైరెక్ట్ చేయబోతూ.. హర్షను హీరోగా ఎంచుకోవడం విశేషం.