మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న వినయ విధేయ రామ విడుదలకు మరో 8 రోజులు మాత్రమే ఉంది. అభిమానుల అంచనాలు అంతకంతా పెరిగిపోతుండగా ప్రమోషన్ విషయంలో అంత హుషారు కనిపించడం లేదన్న కామెంట్స్ కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టైటిల్ తో సంబంధం లేదు అనే తరహలో మరీ ఊర మాస్ చిత్రంగా దీన్ని ప్రోజెక్ట్ చేయడం చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసినట్టు అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో బోయపాటి టీం ప్లాన్ ని మార్చినట్టు కనిపిస్తోంది.
అందులో భాగంగానే కియారా అద్వాని పాదాలను తన భుజం మీద పెట్టుకున్న చరణ్ పోస్టర్ ని నిన్న ఫ్యామిలీ సాంగ్ అయిన దింతానా దింతానా వీడియో ప్రోమోని విడుదల చేయడం ఇవన్ని డ్యామేజ్ రిపేర్ లో భాగమే అని టాక్. సోలోగా వినయ విధేయ రామ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే బరిలో నాలుగు రకాల సినిమాలు ఉన్నాయి, ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ కాబట్టి దాని మీద జనానికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎఫ్2 టీజర్ లోనే ఇదో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అనే ఫీలింగ్ కలిగించారు కాబట్టి ఫ్యామిలీస్ దాని వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.
ఇవన్ని దృష్టిలో ఉంచుకునే వినయ విధేయ రామ ప్రమోషన్ స్టైల్ మార్చినట్టు సమాచారం. జనవరి 11న విడుదల కానున్న ఈ మెగా మూవీ మీద తొంబై కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే వెనక్కు రాబట్టుకోవడం సాధ్యం. అందుకే అన్ని రకాల వనరులను ఉపయోగించుకుని వినయ విధేయ రామ మాస్ కు మాత్రమే కాకుండా అన్ని వర్గాలను అలరించే చిత్రంగా ప్రమోట్ చేసేందుకు బోయపాటి టీం బాగా కష్టపడుతోంది.
Full View