వర్మకు బ్రేక్ వేసేది అదొక్కటే

Update: 2019-02-05 04:50 GMT
ఎవరేమన్నా ఎంత తిట్టి పోసినా తన మానాన తాను సినిమాలు తీస్తూ ఇష్టం ఉంటే చూడండి లేదంటే మానేయండి అంటూ చెప్పుకునే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీ విషయంలో గత కొద్ది రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నాడో చూస్తున్నాం. షూటింగ్ వేగవంతంగానే జరుగుతోంది. ఈ మధ్య కీలకమైన సన్నివేశాల తాలుకు పిక్స్ కూడా పోస్ట్ చేస్తున్నాడు వర్మ. పాత్రధారులను ఇప్పటికే రివీల్ చేసేసాడు. అయితే వర్మ ఇంత ధైర్యంగా అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విలన్ గా చిత్రీకరిస్తూ ఎప్పుడో జరిగిన సంఘటనలను చూపిస్తే జనం చూడటం మాట అటుంచి అసలు సెన్సార్ బోర్డ్ అబ్జెక్షన్ చేయకుండా ఉంటుందా అని వర్మ అభిమానులకు మనసులో ఓమూల సందేహం తొలుస్తూనే ఉంది.

అయితే ఈ విషయంలో వర్మ ఆలోచన ఎలా ఉందో కాని దాని గురించి కొంచెం కూడా భయపడుతున్నట్టుగా కనిపించడం లేదు. దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడి సెన్సార్ బోర్డ్ తో అడ్డంకి ఎదురైతే వర్మ ముందు చేసే పనులు రెండు. ఒకటి అప్పీల్ కు వెళ్ళడం. రెండు తన సినిమాను కావాలని ఆపుతున్నారని కోర్ట్ లో కేసు వేయడం. విషయం కనక పైదాక వెళ్తే ఇది చంద్రబాబు గురించిన నెగటివ్ షేడ్స్ చూపించే సినిమాగా ఆటోమాటిక్ గా సపోర్ట్ దక్కుతుందని కొందరు రాజకీయ విశ్లేషకుల మాట.

ఒకవేళ అదే నిజమైతే వర్మను అడ్డుకోవడం అసాధ్యం. అయితే మహానాయకుడు ఎప్పుడు విడుదల చేస్తారో చెబితేనే తన ట్రైలర్ ను వదులుతాను అంటున్న వర్మ కనీసం దాని గురించి ఒక అవగాహన వచ్చే అవకాశం కూడా ఇవ్వడం లేదు. సో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పగ్గాలు వేసే ఛాన్స్ ఒక్క సెన్సార్ బోర్డ్ అధికారానికి మాత్రమే ఉంది. దానిని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. అయినా సినిమానైతే సెన్సార్ తో అడ్డుకోవచ్చు కాని దీనికైన బడ్జెట్ తో ఈజీగా అమెజాన్ కో నెట్ ఫ్లిక్స్ కో అమ్మితే చాలు పెట్టుబడితో లాభాలు కూడా వచ్చేస్తాయి.చూద్దాం
Tags:    

Similar News