దిల్ రాజు మళ్ళి ట్రాక్ లోకి వస్తారా ?

Update: 2019-01-04 06:11 GMT
గత ఏడాదిని మోస్ట్ బ్యాడ్ ఇయర్ గా దిల్ రాజు ఫీలవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మూడు సినిమాలు విడుదల చేసినా కనీసం తన బ్యానర్ స్థాయిలో గట్టిగా చెప్పుకునేలా ఏది ఆడకపోవడం. అంతకు ముందు సంవత్సరం డబుల్ హ్యాట్రిక్ కొట్టి దర్శకులందరిని ఒకేచోట చేర్చి మరీ సంబరాలు చేసుకున్న ఈ అగ్ర నిర్మాతకు ఇలా జరగడం కొరుకుడు పడని వ్యవహారమే. అందుకే 2019 ఈ సమీకరణలు పూర్తిగా మార్చేస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఈ నెల 12న విడుదల కాబోతున్న ఎఫ్2 తో దిల్ రాజు కొత్త గేమ్ మొదలవుతుంది. వెంకటేష్ వరుణ్ తేజ్ ల స్టార్ కాస్టింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పైకి చాలా ఆకర్షణలు కనిపిస్తున్నా సంక్రాంతి రేస్ లో నెగ్గడం మాత్రం అంత ఈజీగా ఉండదు.

కేవలం కామెడీ ని నమ్ముకుని పెళ్ళాల బాధితులు అనే కాన్సెప్ట్ ను తీసుకుని రిస్క్ లేకుండా చేసిన ప్రయోగం బాగానే ఉంది కాని ఇందులో ఏది సరిగా కుదరకపోయినా కామెడీ అపహాస్యం అయినా ఫలితం వేరుగా ఉంటుంది. ఇప్పటికీ ట్రైలర్ రాకపోవడం గురించి ఫిలిం నగర్ రకరకాల అనుమానాల మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రమోషన్ విషయంలో కూడా దిల్ రాజు టీం ఏమంత దూకుడుగా కనిపించడం లేదు. ఒక పక్క రామ్ చరణ్ వినయ విధేయ రామ అంటూ మాస్ మొత్తాన్ని తన వైపు లాక్కుంటున్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ కథానాయకుడు అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని ఆ రకంగా అటెన్షన్ ని నిలుపుకుంటున్నాడు. అయితే ఎఫ్2 వీటికి దీటుగా నిలవాలి అంటే ఆ రెండింటి కంటే అదిరిపోయే కంటెంట్ ఇందులో ఉందనే టాక్ రావాలి. అదంత ఈజీ అయితే కాదు. రామ్ చరణ్ బాలయ్యల మధ్య నలిగిపోకూడదు అంటే మాములు కామెడీ ఉంటే సరిపోదు. మరి మెగా దగ్గుబాటి తోడల్లుళ్ళు ఎలా నిలుస్తారో వేచి చూడాలి


Full View
Tags:    

Similar News