టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ రేటు ఉన్న నిర్మాతల జాబితాలో ముందు వరుసలో ఉండే నిర్మాత దిల్ రాజు. ఇప్పటి వరకు 31 చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఎన్నో కమర్షియల్ సూపర్ హిట్స్ ను అందుకున్నాడు. కొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచినా కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. కొన్ని ఫ్లాప్ అయినా తక్కువ బడ్జెట్ తో ప్లాన్డ్ గా నిర్మించడంతో నష్టాలను మిగల్చలేదు. రెండు మూడు సినిమాలు మాత్రమే దిల్ రాజుకు నిర్మాతగా నష్టాలను మిగిల్చాయి. కెరీర్ లో 31 చిత్రాలను నిర్మించిన దిల్ రాజు తనకు కేవలం ఏడు సినిమాలు మాత్రమే సంతృప్తినిచ్చాయంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
తాజాగా 'ఎఫ్2' చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న దిల్ రాజు భారీగా లాభాలను దక్కించుకున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో అనీల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మించిన ఎఫ్ 2 చిత్రం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాను నిర్మించిన చిత్రాల్లో ఇప్పటి వరకు తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చినవి 'బొమ్మరిల్లు', 'ఆర్య', కొత్త బంగారు లోకం', 'మిస్టర్ పర్ ఫెక్ట్', 'బృందావనం', 'శతమానం భవతి', 'ఎఫ్2' చిత్రాలేనంటూ దిల్ రాజు పేర్కొన్నాడు. మలితరం మల్టీస్టారర్ చిత్రాలకు ఆజ్యం పోసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం దిల్ రాజుకు పెద్దగా సంతృప్తి ఇవ్వనట్లున్నాయి.
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆధరించి, భారీగా వసూళ్లు కట్టబెట్టిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును దిల్ రాజు తృప్తినివ్వలేదని చెప్పడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఆయన చెప్పిన సినిమా పేర్లన్ని కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు దక్కించుకుని భారీగా లాభాలు తెచ్చి పెట్టినవే. లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలే తృప్తినిచ్చాయంటూ దిల్ రాజు పేర్కొనడం కాస్త విడూరంగా ఉంది. ఇంకా ఆయన బ్యానర్ లో వచ్చిన పలు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, అవార్డులు రివార్డులు అందుకున్నాయి. కాని దిల్ రాజు మాత్రం వాటిని తన జాబితాలో చేర్చలేదు. ఇక ఎన్ని సినిమాలు నిర్మించినా కూడా తాను మాత్రం మొదటి స్థానంను 'బొమ్మరిల్లు' చిత్రానికే ఇస్తానంటూ దిల్ రాజు పేర్కొన్నాడు.