'బాహుబలి' సిరీస్ సినిమాలతో టాలీవుడ్ సినిమాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఆయన ధైర్యంగా ముందడు వేయడం వల్లే ఇప్పడు యావత్ దేశం మొత్తం టాలీవుడ్ వైపు గర్వంగా చూస్తోంది. ఇక్కడి నుంచి ఏ సినిమా విడుదలైన ఆసక్తిని చూపిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. హిట్ సినిమా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద ఉత్తరాది ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మన రాజమౌళి వల్ల తెలుగు సినిమా ఖ్యాతి పెరగడమే కాకుండా ప్రతీ చిన్న సినిమా కూడా రికార్డు స్థాయిలో మార్కెట్ అవుతోంది.
ప్రతీ ఒక్కరూ లాభాల బాట పడుతున్నారు. ఇదిలా వుంటే యంగ్ండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ 'కార్తికుయ 2' రీసెంట్ గా విడదులైన విషయం తెలిసిందే. ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీ ఉత్తరాదిలో వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. చందూ మొండేటి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ దక్షిణాది తో పాటు ఉత్తరాదిలోనూ రోజు రోజుకీ వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.
ఈ మూవీ విజయం జక్కన్న డ్రీమ్ కు మరింత బలాన్నిచ్చిందని తెలుస్తోంది. తాజాగా రాజమౌళి వెల్లడించిన మాటల్లో ఇదే విషయం స్పష్టం గా కనిపించడం విశేషం. 'బాహుబలి' తరువాత మీడియాతో ముచ్చటించిన రాజమౌళి 'మహాభారతం'ని తెరపైకి తీసుకురావాలన్నిది తన డ్రీమ్ అని, ఇదే తన కెరీర్ లో చివరి ప్రాజెక్ట్ అవుతుందని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ మీడియాతో ముచ్చటిస్తూ పౌరాణిక చిత్రాలకున్న ప్రొటెన్షియాలిటీని మరోసారి స్పష్టం చేయడం విశేషం.
రానున్న రోజుల్లో పౌరాణిక ఇతిహాసాలపై చాలా మంది సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఆ వైపు ఆలోచనలు చేస్తున్నారన్నారు రాజమౌళి. ఆయన మాట్లాడుతూ 'పౌరాణిక చిత్రాల నిజమైన సామర్థ్యాన్ని మన దర్శక నిర్మాతలు గ్రహించారు.
రాబోయే రోజుల్లో పౌరాణిక టచ్ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. అలాంటి సినిమాలకు చాలా స్కోప్ వుంది. ఇప్పటికే కొంత మంది దర్శక నిర్మాతలు పౌరాణిక చిత్రాలను రూపొందించే ఆలోచనలను చురుగ్గా అన్వేషిస్తున్నారు' అని అసలు విషయం చెప్పారు జక్కన్న.
నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీ ఉత్తరాదిలో రోజు రోజుకూ పుంజుకుంటూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో రాజమౌళి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా చెప్పాలంటే 'కార్తికేయ 2' దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ హ్యూజ్ హిట్ గా నిలవడం రాజమౌళి భవిష్యత్తులో తెరకెక్కించాలని భావిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'కు మరింత బలాన్నిచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.