‘మిర్చి’ చిత్రంతో దర్శకుడుగా మారిన కొరటాల శివ.. 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. అయితే ఒక్క 'ఆచార్య' చిత్రం ప్లాప్ అవడంతో స్టార్ డైరెక్టర్ ను ఆర్థికంగా దెబ్బతీసిందనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన 'ఆచార్య' సినిమా రెండేళ్లకు పైగా నిర్మాణం జరుపుకుంది. కరోనా పాండమిక్ కారణంగా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఈ మూవీ కోసం ఎవరూ రెమ్యునరేషన్ తీసుకోలేదని మేకర్స్ ముందు నుంచీ చెబుతూ వచ్చారు.
కాంబినేషన్ మీదున్న క్రేజ్ తో 'ఆచార్య' సినిమాని బయ్యర్లు భారీ రేట్లకే కొన్నారు. ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ కొరటాల శివే డీల్ చేశాడనే టాక్ ఉంది. ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మెగా మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు అన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారికి సెటిల్మెంట్ చేయాల్సి వచ్చింది.
'ఆచార్య' మార్కెటింగ్ అంతా కొరటాల చేతుల మీదుగా జరగడంతో.. నష్టపోయిన వారంతా దర్శకుడినే ఆశ్రయించారు. ఆంధ్రాలో తన సన్నిహితులకే సినిమా ఇవ్వడంతో ఇబ్బంది లేదు కానీ.. మిగతా ఏరియాల్లో మాత్రం సెటిల్ చేయాల్సి వచ్చింది. వీరంతా ఇప్పుడు శివ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని వినికిడి.
ఇప్పటికే చిరు - చరణ్ తమ వంతుగా రూ. 20 కోట్లకు పైగా చెల్లింపులు చేశారని ప్రచారం జరుగుతోంది. అయినా సరే నష్టాలు పూడ్చడానికి ఇది సరిపోదు. ఈ నేపథ్యంలో కొరటాల శివ మిగతా నష్టపరిహారం చెల్లించడానికి రెడీ అయ్యారని.. దీని కోసం దర్శకుడు హైదరాబాద్ లోని ఒక ప్రధాన ఏరియాలోని ప్లాట్ ను అమ్మకానికి పెట్టాడని రూమర్లు వినిపిస్తున్నాయి.
దీన్ని విక్రయించడం ద్వారా రూ. 40 నుండి 45 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని.. దాంతో 'ఆచార్య' బయ్యర్లకు పరిహారం చెల్లించాలని కొరటాల శివ యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే కొరటాల శివ వీలైనంత త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడి NTR30 సినిమా మీద దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల స్నేహితుడు సుధాకర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ నడుస్తోంది.