ఇండియాలోనే అసాధారణ క్రేజు ఉన్న టాప్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన దళపతి రజనీకాంత్ కి థియేటర్లు దొరక్కపోవడమా? ఎందుకీ దారుణమైన సన్నివేశం? ఆయన స్టామినాకు తగ్గ రిలీజ్ లేకపోతే అది అవమానం కాదా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రజనీ సన్నివేశం ఇలానే ఉంది. 2.0 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ ఆడి బయటపడినా, ఆ వెంటనే వస్తున్న పేట (పెట్టా-తమిళ్) చిత్రానికి థియేటర్ల పరమైన సమస్య తప్పడం లేదట. గత వైఫల్యాలు రజనీని వెంటాడుతున్నాయనడానికి ఇదే సింబాలిక్.
అంతేకాదు .. ఈ సినిమాకి బిజినెస్ వర్గాల్లోనూ క్రేజు లేకపోవడంతో కేవలం 50 శాతం ఏరియాల్లో మాత్రమే బిజినెస్ చేయగలిగారు. మిగతా 50 శాతం ఏరియాల్లో ఇక్కడ రైట్స్ తీసుకున్న అశోక్ వల్లభనేని సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సిన సన్నివేశం నెలకొంది. రజనీపై అభిమానంతో ఆయన స్ఫూర్తితో పేట చిత్రం హక్కుల్ని కొనుక్కున్నారాయన. ఇదివరకూ నవాబ్, సర్కార్ చిత్రాల్ని ఆయనే రిలీజ్ చేశారు. ఆ సినిమాల ఫలితం సోసోనే అన్న టాక్ కూడా నడిచింది.
ఇలాంటి సన్నివేశంలో రజనీ పేట తెలుగు వెర్షన్ హక్కుల్ని ఆయన ఛేజిక్కించుకుని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎట్టి పరిస్థితిలో హిట్ కొడతానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారాయన. ఇందులో నరసింహా స్టైల్లో రజనీకాంత్ కనిపిస్తారని, ఆ సినిమాలో ఉన్న అన్ని రకాల కోణాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెబుతున్నారు. భారీ పోటీ మధ్య ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి కొనుక్కున్నానని వల్లభనేని చెబుతున్నారు. ఇకపోతే పేట సినిమాకి సరైన థియేటర్లు లేకపోవడంతో ఉన్న థియేటర్లలోనే అడ్జస్ట్ అయ్యి రిలీజ్ చేస్తున్నారట. చాలా తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నాం. అయినా సినిమా బావుంటే జనం ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అంటూ నిర్మాత చెబుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో మూడు స్ట్రెయిట్ సినిమాలు ఈ సంక్రాంతి బరిలో రిలీజవుతున్నాయి. వినయ విధేయ రామా - కథానాయకుడు - ఎఫ్ 2 చిత్రాల్ని అగ్ర పంపిణీదారులు, థియేటర్ ఓనర్లు రిలీజ్ చేస్తుండడంతో ఆ థియేటర్లపై ఇప్పటికే కంచె వేసేశారట. దీంతో రజనీ సినిమాని తీవ్ర నిరాశ నడుమ రిలీజ్ చేస్తున్నారు. సినిమా బావున్నా థియేటర్లు నలిపేస్తాయన్న ఆందోళనా నిర్మాతల్లో కనిపిస్తోంది.