నానికి మతిమరుపేనా.. కొత్తది తగిలిస్తాడా?

Update: 2019-01-29 05:33 GMT
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్' 2014 లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు నానిని న్యాచురల్ స్టార్ గా మార్చేసింది.  అప్పటి నుంచి నాని వెనక్కు తిరిగి చూసిందే లేదు.  అలాంటి మరపురాని విజయాన్ని అందించిన మారుతి దర్శకత్వంలో మరోసారి నటించలేదు నాని.. ఇప్పుడు ఆ సందర్భం వచ్చిందని సమాచారం.

ఈసారి 'భలే భలే మగాడివోయ్' కాంబో రిపీట్ అవుతుందని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్యే మారుతి - నాని ఇద్దరూ కలిసి ఈ విషయంపై చర్చించారట.  మారుతి దర్శకత్వంలో పనిచేసేందుకు నాని ఆసక్తి చూపడంతో మారుతి ఇప్పటికే మంచి స్క్రిప్ట్ తయారు చేయడం మొదలు పెట్టాడట.   మారుతి 'భలే భలే మగాడివోయ్' బ్రాండ్ నేమ్ ను వాడుకుని సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడా లేదా ఈ మతిమరుపు మాలోకం కాన్సెప్ట్ ను పక్కనబెట్టి ఫ్రెష్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడా అనేది వేచి చూడాలి.

మతిమరుపు కాన్సెప్ట్ తప్ప తర్వాత మారుతి టేకప్ చేసిన 'జబ్బులు' ఏవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి.  ఈ సారి కొత్త డిసీజ్ ను నమ్ముకోవడం కంటే ఆల్రెడీ వర్క్ అవుట్ అయిన మతిమరుపును కంటిన్యూ చేసే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  మరి మారుతి మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags:    

Similar News