విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ ప్రమోషన్ లో వేగం పెంచారు. సంక్రాంతి రేస్ లో ముందుగా వస్తున్న సినిమాగా ఓపెనింగ్స్ పరంగా దీనికి చాలా పెద్ద ప్లస్ కలగనుంది. అదలా ఉంచితే మీడియా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విశేషాలు బాగానే షేర్ చేసుకుంటున్న బాలయ్య కథలో లాగే ఇందులో ఎంత మేరకు వాస్తవాలు చెబుతున్నారో అని మీడియా వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. షూటింగ్ ప్రారంభోత్సవం నాడున్న దర్శకుడు తేజ తర్వాత ఇంత భారాన్ని నేను మోయలేను అని తప్పుకున్నాడట.
అసలు ఇది ఇంత బరువుగా ఉంటుందని స్క్రిప్ట్ దశలోనే అర్థమైపోయినప్పుడు మళ్ళి తర్వాత అనిపించడం ఏమిటో. దానికి తోడు మణికర్ణికలో బిజీగా ఉన్న క్రిష్ ని వెంటపడి మొహమాటపెట్టి బాలయ్య తీసుకొచ్చాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే దానికి భిన్నంగా ముంబై నుంచి క్రిష్ స్వయంగా ఫోన్ చేసి బయోపిక్ టేకప్ చేస్తానని అడిగాడట. ఇది అనుమానించాల్సిన విషయమే. ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్ పూర్తి జీవితాన్ని ఈ రెండు భాగాల్లో చూపడం లేదన్నది బలంగా వినిపిస్తున్న మాట.
ద్వితీయ వివాహం-రెండో సారి తలెత్తిన ఆగస్ట్ సంక్షోభం- ఎన్టీఆర్ చనిపోయిన ముందు రోజు నుంచి చివరి క్షణం దాకా జరిగిన హైడ్రామా-బాబు వైపు ఎన్టీఆర్ కొడుకులు వచ్చేయడం లాంటివి కనీస ప్రస్తావన లేకుండానే మహానాయకుడు కూడా పూర్తవుతుందట. ఇది స్వయంగా బాలయ్య చెప్పనప్పటికీ ట్రైలర్ చూస్తే అనుమానాలు రాక మానవు. అయితే వీటికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే 9న మొదటి భాగం షో అయ్యాకే చూడాలి.
Full View