కథానాయకుడి రూట్ క్లియర్ కాలేదా ?

Update: 2019-01-02 12:38 GMT
సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో మొదటి భాగం కథానాయకుడు విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే థియేటర్ల్ కేటాయింపు షోల ప్లానింగ్ అగ్రిమెంట్లు తదితర వ్యవహారాలన్నీ పూర్తయినట్టు సమాచారం. సంక్రాంతి రేస్ లో మొదటి సినిమా కాబట్టి ఫస్ట్ డే వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో వేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. కాకపోతే ఒక న్యూస్ మాత్రం నందమూరి అభిమానులను కాస్త టెన్షన్ పెట్టేలా ఉంది. సెన్సార్ ఫార్మాలిటీస్ కోసం ముందుగానే కాపీని సబ్మిట్ చేసిన క్రిష్ టీమ్ కు బోర్డ్ సభ్యుల నుంచి ఊహించినట్టే చిన్న అభ్యంతరం వచ్చిందని తెలిసింది.

సెకండ్ హాఫ్ లో ఓ రెండు పాత్రలను కాస్త నెగటివ్ గా చూపించారట. అయితే ఆ ఇద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి ముందు ముందు సమస్యలు రాకుండా వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పారట. అయితే ఆ రెండు పాత్రలు ఎవరివి అనే వివరం మాత్రం లీక్ కాలేదు .ఇది ముందే ఊహించిన క్రిష్ దానికి తగ్గ ముందస్తు ఏర్పాట్లలో ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరినీ మరీ ఎక్కువగా నెగటివ్ గా చూపలేదని ఆ మేరకు ముందే వాళ్లకు చెప్పినట్టుగా తెలిసింది. దీని వల్ల ఈ రోజు రావాల్సిన సెన్సార్ సర్టిఫికేట్ రేపు వచ్చే అవకాశం ఉంది.

ఫార్మాలిటీస్ లో ఎక్కడా ఆలస్యం జరగకుండా క్రిష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన భాగం కాబట్టి కథానాయకుడి నుంచే ఎక్కువగా ఆశిస్తున్నారు అభిమానులు. ట్రైలర్ ఆడియో రెండూ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం శుభ సూచకంగా భావిస్తున్నారు ఫ్యాన్స్. 9వ తేదీ తెల్లవారకుండానే సందడి చేయబోతున్న ఎన్టీఆర్ ను కొన్ని ముఖ్యమైన సెంటర్స్ లో మాత్రం ఒకరోజు ముందు స్పెషల్ షోలు వేయబోతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు ఓ రెండు మూడు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News