స్టార్ డైరెక్టర్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. NTR30 వ ప్రాజెక్ట్ గా పట్టాలెక్కనున్న ఈ మూవీ ప్రకటించి నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 'ఆచార్య ' భారీ డిజాస్టర్ కావడంతో దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు సెటిల్ చేయడంలో బిజీగా వున్న కొరటాల శివ ఎట్టకేలకు NTR30 కి సంబంధించిన వర్క్ మొదలు పెట్టారు.
'RRR' వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నుంచి రానున్న సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఎప్పు డెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై మేకర్స్ తో పాటు దర్శకుడు కొరటాల శివపై సంచలన కామెంట్ లు చేసిన ఫ్యాన్స్ రీసెంట్ గా కొరటాల శివ ప్రాజెక్ట్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తో కలిసి సెట్స్ కి సంబంధించిన చర్చలు జరుపుతున్న స్టిల్స్ ని విడుదల చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎట్టకేలకు NTR30 పట్టాలెక్కబోతోందంటూ సెటబ్రేషన్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వుంది.
ఇదిలా వుంటే ఎన్టీఆర్ దర్శకుడికి కొత్త కండీషన్స్ పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ బౌండ్ స్క్రీప్ట్ తో పాటు షెడ్యూల్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్, రిలీజ్ డేట్ ని కూడా ముందు ప్రకటించాలని ఎన్టీఆర్ కండీషన్ పెట్టినట్టుగా ఇన్ సైడ్ టాక్.
తాజా వార్తల ప్రకారం ఈ మూవీని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టాలనే ఆలోచనలో వున్నారట. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
త్వరలోనూ ఫైనల్ డ్రాఫ్ట్ ని కొరటాల శివ వినిపించబోతున్నారట. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే లాంఛనంగా షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఇందులో భాగంగానే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, అర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో లొకేషన్స్ హంట్ ని మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.