‘ఎన్టీఆర్‌’ వేడుక ఉన్నట్లా? లేనట్లా?

Update: 2018-12-06 12:20 GMT
ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ మూవీ రెండు పార్ట్‌ లు కూడా వచ్చే నెల లో రాబోతున్న విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం వచ్చే సంక్రాంతికి రాబోతున్న నేపథ్యం లో ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల 16న చేయాలని మొదట భావించారు. తిరుపతి లో ప్రీ రిలీజ్‌ వేడుక, చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్‌ వేడుక ఉండక పోవచ్చు అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో బాలకృష్ణ ఎన్నిక ప్రచారం లో పాల్గొన్నాడు. దాంతో షూటింగ్‌ కాస్త గ్యాప్‌ వచ్చింది. సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలంటే షూటింగ్‌ గ్యాప్‌ లేకుండా పూర్తి చేయాలి. దానికి తోడు 11న ఫలితాలు వచ్చిన తర్వాత ఒక వేళ ప్రజా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఆ హడావుడి లో ఉంటాడు. అందుకే తిరుపతి లో ప్రీ రిలీజ్‌ వేడుక డిసెంబర్‌ 16న ఉండటం అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

అయితే ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌ 16న ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ట్రైలర్‌ ను విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది. డిసెంబర్‌ చివరి వారంలో ప్రీ రిలీజ్‌ వేడుక చేసే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ క్రిష్‌ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం లో ఎంతో మంది హీరోయిన్స్‌ మరియు స్టార్‌ నటులు నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సినీ మరియు రాజకీయ జీవితాన్ని కళ్ల కు కట్టినట్లుగా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News