మెగా కాంపౌండ్ నుంచి కొత్త బ్రాంచీలు పుట్టుకొస్తున్నాయి. బ్రాంచ్ లు.. బ్రంచులుగా విస్తరణ ప్రారంభమైంది. ఇప్పటికే 10 మంది హీరోలు.. ఒక కథానాయికతో మెగా కాంపౌండ్ కళకళలాడుతోంది. మెగాస్టార్ వారసత్వం కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పేరుతో ఒక బ్రాంచ్ ను రన్ చేస్తోంది. ఇక అల్లు కాంపౌండ్ గీతా ఆర్ట్స్, జీఏ 2 పేరుతో అల్లు హీరోలకు ఆలవాలంగా మారింది. ఇదో రెండో అతిపెద్ద మెగా బ్రాంచ్. ఇప్పుడు ఇదే కాంపౌండ్ లో మెగా బ్రదర్ - వరుణ్ తేజ్ -నిహారిక బ్రాంచ్ వేరుగా ఉంటుంది భవిష్యత్ లో.. ఇక నాలుగో బ్రాంచ్ కూడా మొదలైందా? అంటే అవుననే అర్థమవుతోంది. `పంజా` పేరుతో ఇది విస్తరించనుందా? అంటే అవుననే ప్రూఫ్ దొరికింది.
సాయిధరమ్, వైష్ణవ్ తేజ్ బ్రదర్స్ ఇంటిపేరు పంజా. అయితే సాయిధరమ్ ఇంటిపేరును పాపులర్ చేయాలనుకోలేదు కానీ, తమ్ముడు వైష్ణవ్ మాత్రం `పంజా వైష్ణవ్ తేజ్` అంటూ కొత్త బ్రాండ్ ని కొత్త బ్రాంచీలాగా పరిచయం చేశాడు. పంజా అన్న పేరు వినగానే పవన్ వారసుడు అన్న టాక్ వినిపించింది. సుకుమార్ సైతం అన్నీ మేనమామ పవన్ పోలికలే.. అంటూ వైష్ణవ్ కి కితాబిచ్చేయడం, ఆ కాంపౌండ్ లోనూ ఆ మాటే పాపులరవ్వడం ఇదంతా చూస్తుంటే పవన్ కోసమే పంజా అని పెట్టుకున్నాడా? అంటూ ఆసక్తికర చర్చ సాగింది.
అయితే `పంజా` వెనక వేరొక టాప్ సీక్రెట్ ఉందని తాజాగా రివీలైంది. వైష్ణవ్ తేజ్ న్యూమరాలజీని నమ్ముకున్నాడట. దాని ప్రకారమే తన పేరులో మార్పులు చేర్పులు చేసుకున్నాడు. వైష్ణవ్ తేజ్ ముందు తన ఇంటిపేరు `పంజా`ని స్క్రీన్ నేమ్ లో వేసేలా జాగ్రత్త పడ్డాడు. అలాగే వైష్ణవ్ లోనూ రెండు `ఎస్`లు చేర్చుకోవడం వెనక న్యూమరాలజీనే కారణమట. అయితే పవన్ అప్పటికే పంజా చిత్రంలో నటించడంతో పవన్ స్ఫూర్తితోనే పంజా చేర్చారా? అని జనం కన్ఫ్యూజ్ అయ్యారు. తాజా ఇన్ఫో ప్రకారం అది కరెక్ట్ కాదని అర్థమవుతోంది. అయితే భవిష్యత్ లో మెగా మేనల్లుళ్లు `పంజా` పేరుతో సపరేట్ మెగా బ్రాంచీగా అభివృద్ధి చెందే వీలుందన్న సంకేతం మాత్రం అందింది. బ్రాంచీలు, బ్రాంచీలుగా విడిపోయి బ్రంచ్ లు బ్రంచులుగా బ్రంచ్ పార్టీలు చేసుకుంటూ సక్సెస్ లు కొట్టాలన్నది ప్లాన్ అన్నమాట!!
Full View