ముందే అనుకుని పెట్టాడో, లేదంటే రిజల్ట్ తెలుసో కానీ షారూక్ ఖాన్ తన సినిమాకు జీరో అని పర్‌ఫెక్ట్ గా పెట్టాడు. ఈ సినిమాతో స్టార్ హీరో నుంచి జీరో కి పడిపోయాడు షారూక్. ఒకప్పుడు ఇండియాలో సినిమా- క్రికెట్- షారూక్ అనేవాళ్లు. ఇప్పుడు ఆ షారూక్ అనే బ్రాండ్ దాదాపుగా చెరిగిపోయింది. కింగ్ ఖాన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. డిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్లు ఝడుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్లనుంచి నాన్ స్టాప్ గా ప్లాపులిస్తున్నాడు షారూక్.
షారూక్ కి అర్జెంట్ గా హిట్ కావాలి. కానీ ఏం చెయ్యాలో తెలీడం లేదు. అందుకే.. ఇకనుంచి సినిమాలు ఆపేయాలని అనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. సినిమాల మీద షారూక్ ఇప్పటికే బోలెడంత సంపాదించాడు. రెడ్ చిల్లీస్ పేరుతో బ్యానర్ పెట్టి గత కొన్నేళ్లుగా వరుసగా సినిమాలు తీస్తున్నాడు. మొదట్లో వచ్చాయి కానీ ఇప్పుడైతే బాగా పోతున్నాయి.
అందుకే.. ఉన్నదాన్ని అయినా నిలుపుకునేందుకు సినిమాలు ఆపేస్తే బెటర్ అనుకుంటున్నాడని, అందుకే హీరోగా- నిర్మాతగా కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇచ్చే డిసిషన్ తీసుకున్నాడని బాలీవుడ్ సమాచారం. అయితే ఈ న్యూస్ లో నిజం లేదు. ఎందుకంటే షారూక్ మొండివాడు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునే రకం. అందుకే.. మరో సినిమాతో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. జీరో లాంటి ఫ్లాపుల్ని లెక్కచేస్తే అతని షారూక్ ఎందుకు అవుతాడు మరి.