ఒక ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ లో హడావుడి చేస్తోంది. అందరిలోనూ హాట్ టాపిక్ గా మారి.. ఎవరికి వారు ఆసక్తికరంగా చర్చించుకుంటున్న ఈ వైనం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు.. మీడియాలోనూ ప్రముఖంగా మారింది. ఇంతకూ విషయం ఏమంటే..
పుష్ప పుణ్యమా అని బన్నీ అలియాస్ అల్లు అర్జున్ రేంజ్ ఒక స్థాయికి చేరిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ బన్నీ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక.. కేరళలలో ఉందన్న విషయం తెలిసిందే. పుష్ప పుణ్యమా అని.. హిందీలో ఈ మూవీ సక్సెస్ కావటం.. హిందీ స్ట్రెయిట్ మూవీని దాటేసి.. వసూళ్లను సాధించటంతో ఇప్పుడు అందరి కళ్లు బన్నీ మీద పడుతున్నాయి.
‘పుష్ప’ ఎంతలా పాపులర్ అయ్యిందంటే.. ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో పుష్పరాజ్ ను అనుకరిస్తూ తయారవుతున్న చిట్టి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. పుష్ప లోని కాన్సెప్టులతో కామెడీ బిట్లను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. పుష్ప సూపర్ సక్సెస్ నేపథ్యంలో అల్లు అర్జున్ దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారారని చెబుతున్నారు.
ఓపక్క పుష్ప సెకండ్ పార్ట షూటింగ్ ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉంటే.. మరోవైపు బన్నీతో ఒక మూమీ చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ డిసైడ్ అయ్యిందని చెబుతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి అల్లు అర్జున్ కు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లైకా ప్రొడక్షన్ లో నటించే మూవీ కోసం ఏకంగా రూ.100 కోట్లను ఇస్తామని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ మూవీకి దర్శకుడిగా అట్లీని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్ని కూడా చర్చల దశలోనే ఉన్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇంత భారీ రెమ్యునరేషన్ సొంతం చేసుకున్న హీరోగా బన్నీ నిలుస్తారని చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.