మెగా ప్రిన్స్ గా అభిమానులు పిలుచుకునే వరుణ్ తేజ్ ఇంకా సెటిలవ్వాల్సింది చాలా ఉంది. గత ఏడాది తొలిప్రేమతో మంచి సక్సెస్ అందుకున్నా చివర్లో ప్రయోగాత్మకంగా చేసిన అంతరిక్షం షాక్ ఇచ్చి ముగించింది. అయితే వరుణ్ మార్కెట్ స్టామినా ఎంత దాని గురించి ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి. తొలిప్రేమ అంత సూపర్ హిట్ అయినప్పటికీ థియేట్రికల్ రన్ నుంచి ఫైనల్ గా 18 కోట్లకు మించి రాబట్టలేకపోయింది. ఇక అంతరిక్షం ఎలాగూ ప్లాప్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఫైనల్ రన్ ముగిసేలోపు 7 కోట్లు దాటడమే గొప్ప అనేలా ఉంది.
ఇక్కడ ఒక్క విషయం స్పష్టం. కేవలం తన ఇమేజ్ తో యావరేజ్ కంటెంట్ ను పుష్ చేసి బయ్యర్లను సేఫ్ చేసే రేంజ్ కి వరుణ్ తేజ్ ఇంకా చేరుకోలేదు. ఫిదాతో రికార్డులు సొంతం చేసుకున్నప్పటికీ అందులో శేఖర్ కమ్ముల సాయి పల్లవిల షేర్ ఎంతనే విషయాన్నీ మర్చిపోకూడదు. కేవలం వరుణ్ వల్ల ఆడిన సినిమా కాదది. సో వరుణ్ తేజ్ మీద పదిహేను కోట్ల బడ్జెట్ అయితేనే సేఫ్ అనిపించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అంతకు మించి వెళ్తే రిస్క్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్నయ్య రామ్ చరణ్ మార్కెట్ వేరు. రొటీన్ మాస్ సినిమాతో సైతం నలభై కోట్లు ఈజీగా రాబట్టగలడు. మెగా ఫాన్స్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
నాగబాబు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు చరణ్ తో వరుణ్ ని పోల్చుకుని ఛాన్స్ లేదు. ఏ సినిమాకా సినిమా కొత్తగా కష్టపడాల్సిందే. అందుకే ఇప్పుడు వరుణ్ చేయాల్సింది తన మార్కెట్ రేంజ్ పెరిగే సబ్జెక్టులను ఎన్నుకోవడం. మాస్ జానర్ సూట్ కాదు కాబట్టి వైవిద్యమున్నవి చేస్తూనే సేఫ్ కథలను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎఫ్2తో సంక్రాంతికి చేయబోయే బోణిని బట్టీ వరుణ్ మార్కెట్ గురించి ఇంకొంత క్లారిటీ రావొచ్చు. అది ఎంత పెద్ద హిట్ అయినా అందులో వెంకటేష్ భాగం ఉంటుంది కాబట్టి మరో కొత్త సినిమా దాకా వేచి చూడాల్సిందే
Full View