ఈ సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సంవత్సరంలోనే ‘రంగస్థలం’ బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న రంగస్థలం చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ ‘వినయ విధేయ రామ’. భారీ అంచనాల నడుమ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రంగస్థలం ఎఫెక్ట్ తో ఈ చిత్రం భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర రైట్స్ ద్వారా దాదాపుగా 120 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. రంగస్థలం విడుదలకు ముందు కాస్త అటు ఇటుగా ఈ స్థాయి బిజినెస్ ను చేసింది. అయితే విడుదలైన తర్వాత భారీ వసూళ్లను దక్కించుకోవడంతో నిర్మాత కు మరియు డిస్ట్రిబ్యూటర్ల కు లాభాలు వచ్చాయి. ఇప్పుడు వినయ విధేయ రామ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో అయితే రంగస్థలంను టచ్ చేసింది. మరి కలెక్షన్స్ విషయం లో పరిస్థితి ఏంటా అంటూ చర్చ జరుగుతుంది.
విభిన్నమైన కాన్సెప్ట్ తో సుకుమార్ అద్బుతమైన టేకింగ్ తో రూపొందిన రంగస్థలం చిత్రంతో చిట్టి బాబుగా రామ్ చరణ్ కుమ్మేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా చిట్టి బాబుకు ఫిదా అయ్యారు. అయితే బోయపాటి మూవీ అంతలా జనాలకు రీచ్ అవుతుందా అనేది చూడాలి. చిట్టి బాబులా విధేయ రాముడు కూడా వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.