బిజినెస్ లెక్క‌లు మార్చారా?

Update: 2019-10-24 05:08 GMT
కొన్ని తెల‌సి చేసేవి.. కొన్ని తెలియ‌క చేసేవి.. మ‌రికొన్ని విశ్లేష‌ణ స‌రిగా లేక మొండిగా దిగిపోయేవి. కార‌ణం ఏదైనా ఆన‌క చేతులు కాల్చుకుని మూతులు వాచే బాప‌తు గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంతా మంచిది.

ఆ హీరో మార్కెట్ రేంజు ఎంతో ట్రేడ్ లో అంద‌రికీ తెలుసు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించినా ఇక్క‌డ ఆద‌ర‌ణ స‌రిగా లేదు. ప‌క్కా ట్యాలెంటెడ్ అని ప్రూవ్ అయినా కానీ మ‌న తెలుగు జ‌నం అర‌వ‌తంబీ అంటూ ప‌ట్టించుకోలేదు. అయితే అలాంటి హీరోపై ఏకంగా డిస్ట్రిబ్యూట‌ర్లు 10.2 కోట్ల మేర పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లారంటూ ప్ర‌చారం సాగుతోంది. అంటే అదో ర‌కంగా సాహ‌స‌మేన‌ని చెప్పాలి.

ద‌శాబ్ధ కాలంగా త‌మిళ‌ హీరో విజ‌య్ తెలుగు మార్కెట్ కోసం పోరాటం సాగిస్తున్నా ఇప్ప‌టికీ స‌రైన హిట్టు లేదు. అద్భుతంగా ఉంది అన్న తుపాకి సినిమా సైతం తెలుగులో విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత మెర్స‌ల్ చిత్రం అదిరింది పేరుతో అనువాద‌మై రిలీజైంది. బావుంది అన్నారు కానీ న‌ష్టాలొచ్చాయి. ప్ర‌స్తుతం విజిల్ (బిగిల్) ప‌రిస్థితి అంత‌కు మించి గొప్ప‌గా ఉందా? అంటే.. ఈ సినిమాని 10.2కోట్ల‌కు  అమ్మ‌కాలు సాగించాం అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. 50 ఫీట్ క‌టౌట్ పెట్టి హంగామా చేస్తున్నారు. వాస్త‌వాలు ప‌రిశీలిస్తే ప్రీబిజినెస్ ప‌రంగా ఓ కొత్త విష‌యం తెలిసింది. ఈ సినిమాకి 6.2కోట్ల మేర బిజినెస్ చేశార‌ట‌. ఇక రైట్స్ ని కొనుక్కున్న‌ది చాలా త‌క్కువ మొత్తానికే. నిర్మాత‌లు బ‌య‌ట చెప్పుకునేదానికి వాస్త‌వానికి మ‌ధ్య పొంత‌న కుద‌ర‌డం లేద‌ని ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి పంపిణీ వ‌ర్గాలు రిస్క్ తోనే రిలీజ్ చేస్తున్నాయ‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఇక సినిమా రిలీజ‌వ్వ‌గానే ఉద‌యం ఆట‌కే స‌క్సెస్ మీట్ పెట్టేయ‌డం టాలీవుడ్ ట్రెండ్. అయితే జ‌నం అది చూసి మోస‌పోయే స‌న్నివేశం ఇప్పుడు లేదు. డైరెక్టుగా ప‌బ్లిక్ మౌత్ టాక్ చూశాకే.. ప్రామినెంట్ వెబ్ సైట్ల‌లో రివ్యూలు చదివాకే ఎవ‌రైనా థియేట‌ర్ల‌కు వెళుతున్నారు. యూట్యూబ్ చానెళ్ల డిబేట్లు.. ప‌బ్లిక్ మౌత్ టాక్ ని చూస్తున్నారు ముందుగా. ఈ వారంలో విజిల్ రిలీజ‌వుతోంది. మ‌రి రిపోర్ట్ ఏమిటి అన్న‌ది చూడాలి. ప్ర‌తిసారీ అనువాద చిత్రాల‌తో లాభం నిర్మాత‌కు.. న‌ష్టం డిస్ట్రిబ్యూట‌ర్ కి అన్న‌ట్టుగానే ఉంటుంద‌ని వాపోతున్న సంద‌ర్భాలున్నాయి. మ‌రి ఈ గండం నుంచి ఎలా గ‌ట్టెక్కిస్తారో చూడాలి.
Tags:    

Similar News