సినిమా లీకులకు అలా చెక్ పెట్టారా..?

Update: 2023-01-06 03:56 GMT
ఒక సినిమా రిలీజ్ కు ముందే ఆ సినిమాకు సంబంధించిన విషయాలను లీక్ చేయడం లాంటివి అప్పట్లో బాగా జరిగాయి. ఆ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నికల్ టీం నుంచే ఈ లీక్స్ జరుగుతున్నట్టు తెలిసిందే. సినిమా లీకుల విషయంలో దర్శక నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిలా మారింది. కోట్లకు కోట్లు బడ్జెట్ పెడుతూ సినిమా సెక్యురిటీ విషయంలో లోపాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. స్టార్ సినిమా అంటే ఆడియన్స్ లో ఆసక్తి ఉంటుంది. అందుకే రిలీజ్ కు ముందే ఆ సినిమాలోని అంశాలు లీక్ చేస్తే ఆ మజా వేరేలా ఉంటుంది.

అంతకుముందు ఇలాంటివి బాగా జరిగేవి. టీజర్, ట్రైలర్ మాత్రమే కాదు సినిమాలోని కొన్ని సీన్స్ కూడా ఎడిటింగ్ టేబుల్ నుంచి లీక్ చేసేవారు. ఆ స్టార్ అభిమాని అవడమో లేక సినిమా చూసి ఆ ఎగ్జైట్ మెంట్ ని ఆపుకోలేక లీక్ చేయడమో చేస్తుండే వారు. అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా విషయంలో దాదాపు సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య సినిమా లీకులనేవి కేవలం ఆన్ లొకేషన్ పోస్టర్స్ మాత్రమే తప్ప ఎడిటింగ్ టేబుల్ మీద నుంచి లీక్ అవ్వట్లేదు.

దీనిపై దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తుంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరిగే టైం లో ప్రొడక్షన్ కి సంబంధించిన ఒక వ్యక్తిని ప్రత్యేకంగా దీని కోసమే పెడుతున్నట్టు తెలుస్తుంది. అలా ఒక పర్సన్ ని సినిమా లీకులు కాకుండా నిఘా పెట్టారట. ఇదే కాదు ఒకవేళ పొరపాటున ఏదైనా స్టార్ సినిమా నుంచి ఫోటోలు, వీడియో లీక్ అయితే మరో టీం దాన్ని వెంటనే డిలీట్ చేసేలా కూడా పనిచేస్తున్నారట. అలా చేయడం వల్ల లీకైన సరే అది అంతా స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న RC15 సినిమా విషయంలో ఫోటోలు లీక్ అవుతుండగా శంకర్ ప్లాన్ మార్చి సినిమా అంతా అవుట్ సోర్సింగ్ కి ఇచ్చినట్టు టాక్. అలా చేయడం వల్ల ఈమధ్య సినిమా నుంచి లీక్స్ కాకుండా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రతి సినిమాకు ఒక టీం ప్రత్యేకంగా సినిమా లీకులు జరగకుండా పనిచేస్తున్నారట. మరో టీం లీకైన వాటిని డిలీట్ చేసే పనిలో ఉన్నారట. ఇది ఓ రకంగా పరిశ్రమకు మేలు చేస్తుందని చెప్పొచ్చు. లీక్ కాకుండా జాగ్రత్త పడుతూ లీకైన వాటిని కూడా వెటనే అందుబాటులో లేకుండా చేస్తూ ఓ రకంగా సినిమాను కాపాడుతున్నట్టే లెక్క.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News