వేధింపుల కేసు ప్రీతీ వెన‌క్కి తీసుకున్న‌ట్లేనా?

Update: 2018-08-02 07:21 GMT
ప్ర‌ముఖుల మ‌ధ్య సంబంధాలు.. బంధాలు.. అనుబంధాలు చాలా సిత్రంగా ఉంటాయి. కొన్నాళ్ల వ‌ర‌కూ బాగానే ఉండే వారు.. ఉన్న‌ట్లుండి తీవ్ర నిర్ణ‌యాలు తీసుకుంటారు. మ‌రికొన్నిసార్లు కేసులతో కోర్టు మెట్లు సైతం ఎక్కుతుంటారు. బాలీవుడ్ సొట్ట‌బుగ్గ‌ల సోయ‌గం ప్రీతిజింటాకు బాయ్ ఫ్రెండ్ గా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నెస్ వాడియా పేరు ఎంత ప్ర‌ముఖంగా వినిపించిందో తెలిసిందే. వీరిద్ద‌రి భాగ‌స్వామ్యంలో ఐపీఎల్ జ‌ట్ట‌ను కొనుగోలు చేయ‌టం తెలిసిందే.

కాలక్ర‌మంలో బాయ్ ఫ్రెండ్ కాస్తా.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా మారిపోవటం తెలిసిందే. త‌న బిజినెస్ పార్ట‌న‌ర్ గా ఉన్న నెస్లీవాడియాపై వేధింపుల కేసును పెట్టి సంచ‌ల‌నం సృష్టించారు ప్రీతీజింటా. ఇద్ద‌రి మ‌ధ్య ఎంత విభేదాలు వ‌స్తే మాత్రం.. మ‌రీ కేసుల వ‌ర‌కూ వెళ్ల‌ట‌మా? అని ప‌లువురు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

ఇదిలా ఉంటే.. దాదాపు రెండేళ్ల క్రితం ప్రీతీ జింటా  పెళ్లి చేసుకోవ‌టం.. ఆ త‌ర్వాతి కాలంలో త‌న మాజీ బాయ్ ఫ్రెండ్ నెస్  వాడియాతో గొడ‌వ‌లు రాజీకి వెళ్లిపోయాయి. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా వేధింపుల‌కేసుపై బొంబాయి హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా నెస్లీవాడియా త‌ర‌ఫు న్యాయ‌వాది మాట్లాడుతూ.. విబేదాలు తొలిగిపోయాయ‌ని.. త‌న క్ల‌యింట్ పై ఫిర్యాదు చేసినప్ప‌టికీ.. ఇరువురు క‌లిసి ఐపీఎల్ ఆక్ష‌న్ లో క‌లిసి పాల్గొన్నార‌ని పేర్కొన్నారు.

దీనిపై స్పందిస్తూ వేధింపుల‌పై ప్రీతిజింటా స్పంద‌న‌ను కోరారు. .ఈ కేసును వాయిదా వేస్తూ.. త‌దుప‌రి విచార‌ణ స‌మ‌యానికిత‌న తాజా వాద‌న‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించారు. తాజా ప‌రిణామాలు చూస్తే.. త‌న మాజీ బాయ్ ఫ్రెండ్ ను ప్రీతీ కనిక‌రించి క్ష‌మించిన‌ట్లుగా తెలుస్తోంది.  


Tags:    

Similar News