ఆయనో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈమధ్య మంచి ఫామ్ లోకి వచ్చాడు. పోటీలో ఉన్న ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో టాలీవుడ్ లో ఇతని హవా ఎక్కువైంది. ఈ పరిస్థితిలో ఆయన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో నిర్మాతలకు తలనెప్పిగా మారుతోందట.
తను సంగీతం అందించే ప్రతి సినిమాలో ప్రమోషన్ వీడియో సాంగ్స్ చేయాల్సిందిగా నిర్మాతలను మోహమాటపెట్టేస్తున్నాడట. ఒక తమిళ సంగీత దర్శకుడి తరహాలో ప్రతి సినిమాలో ఒక ప్రమోషన్ వీడియో సాంగ్ చేయాలని పట్టుబడుతూ ఉండడంతో నిర్మాతకు అది అదనపు ఖర్చు అవుతోంది. ఈ ప్రమోషన్ యావతో పాటుగా మరో విషయం కూడా ఉందట. ఈయనకు ట్యూన్స్ రావాలంటే పార్క్ హయత్ లోనే రూమ్ వెయ్యాలట. అది కూడా రూమ్ నెంబర్ 821. ఆ రూమ్ నంబర్ తో సెంటిమెంట్ ఉందేమో కానీ అదే నంబర్ రూమ్ కావాలని అంటున్నాడట.
ఇదిలా ఉంటే ఇతని మీద ఈమధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. ట్యూన్స్ కాపీ కొడుతున్నాడనే విమర్శలతో పాటుగా మరో మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్ ను కూడా కాపీ కొడుతున్నాడని విమర్శిస్తున్నారు. దీంతో ఫాం లో ఉన్నప్పుడే అణకువగా ఉండాలని.. ఈ నెగెటివిటీని తగ్గించుకోవాలని అభిమానులు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను కోరుతున్నారు. మరి ఇదంతా ఆయన వినిపించుకుంటాడో లేక మరో ప్రొడ్యూసర్ ను వన్ మోర్ ప్రమోషన్ వీడియో సాంగ్ అడుగుతాడో వేచి చూడాలి.