బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించే సినిమాలన్నీ తెలుగులో ఆల్మోస్ట్ రీమేకవుతున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి సురేష్ బాబు ఆయుష్మాన్ నటించిన కథలను లాక్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు వేరొక కాంపౌండ్ లో ప్రతిభావంతుడైన ఆయుష్మాన్ ఖురానా నటించిన క్రేజీ చిత్రం రీమేకవుతోందని ప్రచారమవుతోంది.
నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ గణేష్ అరంగేట్రం చేస్తున్న 'స్వాతిముత్యం' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంది. అయితే ఆ హీరోకి ఒక లోపం ఉంటుంది. తన పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ కి విఘాతం కలిగించే సమస్య ఒకటి వేధిస్తుంది. అదేమిటో ట్రైలర్ లో రివీల్ కాకుండా సస్పెన్స్ లో ఉంచారు.
ప్రధాన ట్విస్ట్ ను దాచేయడంతో ఇప్పుడు ఎవరికి వారు దానిపై ఊహాగానాలు సాగిస్తున్నారు. హీరో అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటాడని.. కానీ దానిని దాచి ఉంచారని ముచ్చట పెడుతున్నారు. ఇంచుమించు ఇదే సమస్యతో తెరకెక్కిన ఆయుష్మాన్ ఖురానా 'శుభ్ మంగళ్ సావ్ దాన్'కి ఈ చిత్రం అనధికారిక రీమేక్ కావచ్చంటూ ఊహిస్తున్నారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాల మనస్తత్వం దానిపై ఎలా కేంద్రీకృతమై ఉంది అనేది తెరపై చూపిస్తున్నారట. అయితే ఈ విషయాలన్నీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
అవేవీ విజయాలు సాధించలేదు! ఇంతకుముందు టాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన విక్కీ డోనర్ ని తెలుగులో రీమేక్ చేసారు. కానీ అది ఇక్కడ ఆశించినంతగా ఆడలేదు. రాజ్ తరుణ్ 'డ్రీమ్ గర్ల్' రీమేక్ రెండు షెడ్యూల్ లు తెరకెక్కాక ఆగిపోయింది.
స్వాతిముత్యం సన్నివేశం ఎలా ఉంటుందో చూడాలి! అంటూ ముచ్చట సాగుతోంది. కానీ అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని ఎంతో వినోదాత్మక కంటెంట్ తో రూపొందిస్తోంది. విజయంపై ధీమాగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.