మ‌ళ్లీ పీరియాడిక్ ఫిక్ష‌న్ తో మెస్మ‌రైజ్ చేస్తాడ‌ట‌!

Update: 2022-09-10 07:13 GMT
గ‌త కొంత కాలంగా ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ పీరియ‌డిక్ ఫిక్ష‌న‌ల్ సినిమాల జోరు పెరుగుతోంది. ఈ త‌ర‌హా సినిమాలు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని అందిస్తుండ‌టంతో వీటికే ప్ర‌ధానంగా ప‌ట్ట‌డంక‌డుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో పీరియాడిక‌ల్ ఫిక్ష‌న్ మూవీ తెర‌పైకి రాబోతోంది. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో తీవ్ర సంఘ‌ర్ష‌ణ‌కు గురైన ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి అనూహ్యంగా పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ ఎపిక్ ల‌వ్ స్టోరీ 'సీతారామం' మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

అద్భుత‌మైన క‌థా,క‌థ‌నాల‌తో బ్యూటిఫుల్ విజువ‌ల్ వండ‌ర్ గా.. ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ మూవీని తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా విమ‌ర్శకుల‌, సెల‌బ్రిటీల‌, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల్సి సొంతం చేసుకుని ద‌ర్శ‌కుడిగా మ‌రో మెట్టు ఎక్క‌డం విశేషం. ద‌ర్శ‌కుడిగా అత్యుత్త‌మ‌మైన సినిమాని అందించి త‌న గౌర‌వాన్ని పెంచుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి 'సీతారామం' త‌రువాత ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడు? .. ఎవ‌రితో చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే ఈ సారి కూడా హ‌ను రాఘ‌వ‌పూడి మ‌ళ్లీ పీరియాడిక్ ఫిక్ష‌న్ నే తెర‌పైకి తీసుకునానున్నాడ‌ని వార్తుల వినిపిస్తున్నాయి. 'సీతారామం' త‌రువాత హ‌ను రాఘ‌వ‌పూడి స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ కి సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీ ఓ మ‌ల్టీస్టార‌ర్ అని తెలిసింది.

ఇందులో ఇద్ద‌రు క్రేజీ హీరోలు న‌టించ‌నున్నార‌ట‌. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌తో సినిమా చేయాల‌ని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడ‌ట‌. అది ఇప్ప‌టికి కుదిరింద‌ని, సాలీడ్ హిట్ త‌రువాతే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని భావించాడ‌ట‌.

దీంతో ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి హ‌ను డ్రీమ్ ప్రాజెక్ట్ లో న‌టించే హీరోలు ఎవ‌రు? .. త‌న‌తో సినిమాలు చేసిన హీరోల‌నే హ‌ను ఈ పీరియాడిక్ మ‌ల్టీస్ట‌ర‌ర్ కోసం తీసుకోబోతున్నాడా? .. అనే విష‌యాలు త్వ‌ర‌లోనే తెలియనున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News