సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ అంచనాలతో అంత కంటే భీభత్సమైన ఓపెనింగ్స్ తో వచ్చిన వినయ విధేయ రామ దారుణమైన డిజాస్టర్ గా నిలవడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కంటెంట్ ఇంత నాసిరకంగా ఉంటేనే 60 కోట్ల షేర్ వచ్చింది ఒకవేళ యావరేజ్ గా ఉన్నా ఈజీగా వంద కోట్లు ఎకౌంటులో పడిపోయేవని అభిమానులు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. 93 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వివిఅర్ ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు చేతిలో నికరంగా 30 కోట్ల నష్టాన్ని పెట్టేసింది.
అయితే దీన్ని ఏదోలా భర్తీ చేయాలని తలచిన నిర్మాత దానయ్య 5 కోట్లు చరణ్ మరో 5 కోట్లు ఇవ్వడానికి ప్రాధమిక అంగీకారం జరిగిందని వార్తలు ఉన్నాయి. అయితే మరో 5 కోట్లు బోయపాటి శీను కనక భరిస్తే కనీసం సగం భారాన్ని బయ్యర్ల మీద తగ్గించినట్టు అవుతుందనే ఆలోచనతో దానయ్య ఆ ప్రతిపాదన తీసుకెళ్లాడట. అయితే దర్శకుడిగా పారితోషికం తీసుకుని సినిమా చేసే తాను నిర్మాతతో సమానంగా ఎలా నష్టపరిహారం ఇవ్వాలని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక్కడే మాట మాట పెరిగి తిట్టుకున్న ఈ ఇద్దరినీ దిల్ రాజు ఎన్వి ప్రసాద్ కలిసి శాంతపరిచినట్టు వినికిడి.
దీనికి ఎలాంటి ఆధారాలు లేవు కాని ఎవరో ప్రత్యక్ష సాక్షులుగా చెప్పబడుతున్న వారి నుంచి వచ్చిన కథనం మేరకు ఫిలిం నగర్ లో దీని గురించే చర్చ జరుగుతోంది. ఫైనల్ గా ఏదైనా అండర్ స్టాండింగ్ కు వచ్చారా లేదా అనే స్పష్టత ఇంకా రాలేదు. సినిమాను ఇంత దారుణంగా తీయడం బోయపాటి తప్పిదమే కాబట్టి సమానంగా బాధ్యత తీసుకోవాలని దానయ్య డిమాండ్ చేస్తుండగా శీను ఈ పాయింట్ దగ్గరే రివర్స్ అయినట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా వినయ విధేయ రామ రగడ పూర్తిగా సమిసిపోలేదని దీన్ని బట్టే అర్థమవుతోంది.