కాస్ట్యూమ్స్ తో రజినీకి అనారోగ్యం?

Update: 2016-07-05 05:36 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి రిలీజ్ పై ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్లే. ఈ నెల 22న కబాలి రిలీజ్ కి రెడీ అవుతుండగా.. ప్రస్తుతం రజినీ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన తిరిగిరాగానే ప్రమోషన్ వర్క్స్ తారా స్థాయికి చేరుకుంటాయి. అయితే.. నెలన్నరకు పైగా అమెరికాలో ఉండి రజినీకాంత్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావడానికి రీజన్ ఇదే అంటూ ఓ ప్రచారం జరుగుతోంది.

ఇటు కబాలితో పాటే రజినీకాంత్ రోబో సీక్వెల్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. 2.0 టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ 50శాతం పూర్తయిందని దర్శకుడు శంకర్ స్వయంగానే చెప్పాడు. ఇందులో రజినీకి సంబంధించిన సన్నివేశాలనే ఎక్కువగా తీశారట. అయితే.. ఈ మూవీలో గ్రాఫిక్స్ కి ఉన్న ప్రాధాన్యం కారణంగా.. అనేక సన్నివేశాల్లో బరువైన కాస్ట్యూమ్స్ ను సూపర్ స్టార్ ధరించాల్సి వచ్చిందట. వాటి బరువు 40 కిలోలు అంటున్నారు. ఇంత బరువైన కాస్ట్యూమ్స్ ని వేసుకుని షూటింగ్ చేయడంతోనే.. రజినీ ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారనే టాక్ వినిపిస్తోంది.

ఈ 40 కిలోల కాస్ట్యూమ్స్ తో పాటు కబాలి షూటింగ్ లో పాల్గొనడం.. ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పని చేయడంతోనే రజినీ హెల్త్ పాడయిందట. అయితే.. రజినీకాంత్ అనారోగ్యం పాలైన మాట వాస్తవమే అయినా.. కారణం ఇదే అని ఎవరూ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. విశ్రాంతి పూర్తవగానే ఇండియాకి వచ్చి కబాలి ప్రచారం ప్రారంభిస్తారని తెలుస్తోంది.
Tags:    

Similar News