100% తమిళ లవ్ కుమారిదే

Update: 2017-06-09 07:35 GMT
తెలుగులో సుకుమార్ తీసిన సినిమా 100% లవ్ సినిమా చాలమందికి ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. అందులో పాలనురగల అందం చందం ఉన్న  తమన్నా చేసిన అద్భుత నటనకు యూత్ మొత్తం ఫిధా అయ్యారు. ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్ర ఆదారంగా సినిమా ముందుకు సాగటం జరుగుతుంది. హీరో గా నాగ చైతన్య నటనలో కొత్తదనం, తమన్నా బ్యూటిఫుల్ యాక్ట్ కలిసి ఈ సినిమాను హిట్ ట్రాక్ పైకి నడిపించింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో నిర్మిస్తున్నారు.

తమిళ రీమేక్ లో కూడా తమన్నా అయితే బెటర్ అనుకుని.. తరువాత రూటు మార్చారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో కన్ఫామ్ అయిన వేళ.. ఇప్పుడు మరో షాకర్ వింటున్నారు. ఇప్పుడు ఈ ఆఫర్ ను 'కుమారి 21 f' ఫేమ్ హెబ్బ పాటేల్ చేతిలో పెట్టాడట డైరెక్టర్ చంద్రమౌళి. హెబ్బా పాటేల్ ఈ ఆఫర్ రాంగానే క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టేసిందని తెలుస్తోంది. తమిళంలో పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ రావడం హెబ్బ కు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోగా జి‌వి ప్రకాష్ కుమార్ నటిస్తున్నారు. తమిళ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూ నే ఇప్పుడు హీరోగా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడనీ కుర్రాడు.

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మాసంలో మొదలుకావచ్చు అని చెబుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ చంద్రమౌళి సుకుమార్ తో చాల ఏళ్లుగా కలిసి పని చేశారు. ఇప్పుడు తమిళంలో మనోడు 100% లవ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ తరువాత కుమారి 21 f కూడా తీస్తాడట. హీరోయిన్ విషయంలో సుకుమార్ రికమండేషన్ వలనే హెబ్బా కు ఛాన్సిచ్చారని టాక్ నడుస్తోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News