హెబ్బా కోసమే ఎక్కువ ఖర్చుపెట్టారట!

Update: 2017-10-11 08:20 GMT
కుమారి 21 ఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది బాంబే బ్యూటీ హెబ్బా పటేల్. గ్లామర్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టని హెబ్బాకు కుమారి తరువాత వరుస ఆఫర్లు రావడంతో ఈ బ్యూటీనే మెయిన్ రోల్ గా పెట్టి సినిమాలు కూడా తీసేందుకు దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు. అలా వచ్చిన సినిమాలే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ - ఏంజెల్. ఈ రెండు సినిమాల్లో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకొని, హెబ్బాను సక్సెస్ ట్రాక్ తప్పేలా చేసింది. ఈ దెబ్బకి ఆ తరువాత హెబ్బా హీరోయిన్ గా నటించిన సినిమాలు అన్ని వరుస ఫ్లాపులు అవుతూ వచ్చాయి. హెబ్బా ఫుల్ హోప్స్ పెట్టుకున్న అంధగాడు - మిస్టర్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టేశాయి.

అయితే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ తో పాటే హెబ్బా కమిటైన సోషియోఫాంటసీ మూవీ ఏంజెల్ గ్రాఫిక్స్ వర్క్ లో జాప్యం కారణంగా ఇంతవరుకు విడుదల కాలేదు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి తనయుడు నాగ అన్వేష్ ఈ సినిమాలో హీరో. హెబ్బా ఈ చిత్రంలో గంధర్వ కన్యగా నటించింది. కెరీర్ పీక్ టైమ్ లో ఉండగా ఈ సినిమాను కమిటైనందుకు హెబ్బా కు  ఏంజెల్ టీమ్ భారీగానే రెమ్యూనీరేషన్ ఇచ్చారు. దానికి తోడు గంధర్వ కన్య పాత్ర కావడంతో హెబ్బా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అందుకు తగ్గట్లుగానే భారీ గ్రీన్ మ్యాట్ సెటప్స్ వేసి హెబ్బా పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హెబ్బా చేసిన ఎపిసోడ్స్ కోసం ఏంజెల్ టీమ్ కొన్ని కోట్లు ఖర్చు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కంప్యూటర్ గ్రాఫిక్స్ లో సింహా భాగం ఖర్చు అయినట్లుగా సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఏంజెల్ బడ్జెట్ 8 కోట్లు దాటొచ్చని మార్కెట్ లో అంచనాలు ఉన్నాయి. నవంబర్ 3న చిత్ర విడుదల ఉంటుందని ఇటీవలే ఏంజెల్ యూనిట్ అఫీషియ్ గా ఎనౌన్స్ చేసింది. అదే రోజున మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి వాటితో పోటీ పడుతూ ఏంజెల్ సేఫ్ జోన్ లోకి వెళ్తుందేమో చూడాలి.
Tags:    

Similar News